ఐఏఎస్ క్యాడర్ రూల్స్ సవరణకు ఏపీ కూడా వ్యతిరేకం..
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ సవరిస్తూ కేంద్రం చేసిన ప్రతిపాదనలను వ్యతిరేకించే రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా చేరింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ నిర్ణయాన్ని తెలియజేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధానికి లేఖలు రాశారు, తమ వ్యతిరేకతను తెలియజేశారు. తాజాగా ఈ లిస్ట్ లో ఏపీ సీఎం జగన్ కూడా చేరారు. కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు ఒప్పుకోవడం లేదని, ఆయన ఆ లేఖలో వివరించారు. కేంద్ర సర్వీసులకు పంపే […]
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ సవరిస్తూ కేంద్రం చేసిన ప్రతిపాదనలను వ్యతిరేకించే రాష్ట్రాల జాబితాలో ఏపీ కూడా చేరింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ నిర్ణయాన్ని తెలియజేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధానికి లేఖలు రాశారు, తమ వ్యతిరేకతను తెలియజేశారు. తాజాగా ఈ లిస్ట్ లో ఏపీ సీఎం జగన్ కూడా చేరారు. కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు ఒప్పుకోవడం లేదని, ఆయన ఆ లేఖలో వివరించారు. కేంద్ర సర్వీసులకు పంపే ఐఏఎస్ అధికారుల డిప్యుటేషన్ పై తుది నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉండాలని ఆయన పేర్కొన్నారు.
ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన కేంద్రం.. రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరింది. ఈ క్రమంలో ఏపీ సీఎం కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రాల నుంచి కేంద్రానికి డిప్యుటేషన్ పై పంపించే ఐఏఎస్ అధికారుల అంశంలో సవరణలు తీసుకుని వస్తున్న కేంద్ర చొరవను జగన్ అభినందించారు. అయితే రాష్ట్రాలు డిప్యుటేషన్ కి అనుమతిచ్చి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తేనే ఆ తర్వాత డిప్యుటేషన్ పై బదిలీ జరగాలని ఆయన కోరారు. డిప్యుటేషన్ విషయంలో ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని లేఖలో పేర్కొన్నారు. డిప్యుటేషన్ పై వెళ్లే ఐఏఎస్ అధికారి రిపోర్ట్ చేసే గడువును నిర్ణయించే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ తీసుకుని వస్తున్న తాజా సవరణ పై అభ్యంతరం వ్యక్తం చేశారు ఏపీ సీఎం. ఉన్నట్టుండి రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో ఉండే అధికారులు వెళ్ళిపోతే పాలనలో ఇబ్బందులు ఎదురవుతాయని లేఖలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు..
ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల్లో సవరణలు ప్రతిపాదించిన తర్వాత క్రమంగా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. ఐఏఎస్ రూల్స్- 1954కి కేంద్రం చేసిన సవరణ ప్రతిపాదనలు కేంద్ర -రాష్ట్ర సంబంధాల మధ్య చిచ్చురేపాయి. కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. తాజాగా ఏపీ సీఎం కూడా ఈ సవరణలు వ్యతిరేకిస్తూ లేఖ రాశారు.