కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు " ఏపీ ఆర్థిక శాఖ క్లారిటీ..
ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చి నిరసనలు చేపట్టాయి. అదే సమయంలో ఫిబ్రవరి -1న ఉద్యోగుల ఖాతాల్లో పడాల్సిన జీతాలపై ఇంకా సందిగ్ధత తొలగిపోలేదు. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలంటూ ఉద్యోగులు పట్టుబడుతున్నారు, కొత్త పీఆర్సీ అమలు చేయాల్సిందేనంటూ ప్రభుత్వం చెబుతోంది. ఈ దశలో తాజాగా ఆర్థిక శాఖ మరోసారి జీతాలపై క్లారిటీ ఇచ్చింది. కొత్త పీఆర్సీ ప్రకారమే బిల్లులు సిద్ధం చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. బిల్లులు ప్రాసెస్ చేసే విషయంలో అవసరమైతే కఠినచర్యలకు […]
ఏపీలో ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చి నిరసనలు చేపట్టాయి. అదే సమయంలో ఫిబ్రవరి -1న ఉద్యోగుల ఖాతాల్లో పడాల్సిన జీతాలపై ఇంకా సందిగ్ధత తొలగిపోలేదు. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలంటూ ఉద్యోగులు పట్టుబడుతున్నారు, కొత్త పీఆర్సీ అమలు చేయాల్సిందేనంటూ ప్రభుత్వం చెబుతోంది. ఈ దశలో తాజాగా ఆర్థిక శాఖ మరోసారి జీతాలపై క్లారిటీ ఇచ్చింది. కొత్త పీఆర్సీ ప్రకారమే బిల్లులు సిద్ధం చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. బిల్లులు ప్రాసెస్ చేసే విషయంలో అవసరమైతే కఠినచర్యలకు సైతం సిద్ధంగా ఉండాలని ఆయా విభాగాల అధిపతులకు సూచించింది.
నిర్దేశించిన సమయంలోగా కొత్త పీఆర్సీ ప్రకారం బిల్లులను ప్రాసెస్ చేయాలని సచివాలయ శాఖాధిపతులు, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు ఆర్థిక శాఖ విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. జీవోలను ఉల్లంఘించకూడదని, వాటికి విరుద్ధంగా ప్రవర్తించకూడదని కూడా తేల్చి చెప్పింది. ప్రభుత్వశాఖలు, విభాగాలు, విశ్వవిద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన మినిమమ్ టైమ్ స్కేల్ మేరకు జనవరి వేతనాలు చెల్లించాలని తెలిపింది.
ట్రెజరీ ఉద్యోగులపై ఒత్తిడి..
వాస్తవానికి ఉద్యోగులు ఫిబ్రవరి ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు వెళ్తామంటున్నారు. ఆమేరకు సమ్మె నోటీసు ఇచ్చారు కాబట్టి.. ఈలోగా వారంతా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక్కడ మిగతా సిబ్బందిపై పెద్దగా ఒత్తిడి లేదు కానీ ట్రెజరీ ఉద్యోగులే జీతాల బిల్లులు ప్రాసెస్ చేసే సందర్భంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఓవైపు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలంటూ ఉద్యమం చేస్తున్నారు ఉద్యోగులు. మరోవైపు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ దశలో ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ విభాగం ఉద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. జీవోలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న ఆర్థిక శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉద్యోగ సంఘాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.