Telugu Global
Cinema & Entertainment

సర్కారువారి పాట షూటింగ్ అప్ డేట్స్

తాజాగా మహేష్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఐసొలేషన్ తర్వాత తిరిగి కోలుకున్నాడు. మరి అతడు నటిస్తున్న సర్కారువారి పాట సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి తాజాగా అప్ డేట్ బయటకొచ్చింది. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే నెల మూడో వారం నుంచి సర్కారువారిపాట సినిమా సెట్స్ పైకి వస్తుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ కొనసాగుతోంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో పెద్ద సినిమాల షూటింగ్స్ […]

సర్కారువారి పాట షూటింగ్ అప్ డేట్స్
X

తాజాగా మహేష్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఐసొలేషన్ తర్వాత తిరిగి కోలుకున్నాడు. మరి అతడు నటిస్తున్న సర్కారువారి పాట సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి తాజాగా అప్ డేట్ బయటకొచ్చింది. పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే నెల మూడో వారం నుంచి సర్కారువారిపాట సినిమా సెట్స్ పైకి వస్తుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థర్డ్ వేవ్ కొనసాగుతోంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో పెద్ద సినిమాల షూటింగ్స్ చేయడం కష్టం. అందుకే కొత్త షెడ్యూల్ ను ఫిబ్రవరి మూడో వారానికి ప్లాన్ చేశారు. అస్సాంలోని అటవీ ప్రాంతంలో ఈ షెడ్యూల్ ఉంటుంది.

అస్సాంలోని అటవీ ప్రాంతంలో హీరో మహేష్ బాబు, విలన్ సముత్తరఖని మధ్య ఓ భారీ ఫైట్ తీయబోతున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం యూనిట్ అంతా ఎదురుచూస్తోంది. ఎందుకంటే, ఒక్కసారి సినిమా సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం, ఇక టోటల్ షూట్ పూర్తయ్యేవరకు కాల్షీట్లు ఇస్తున్నాడు మహేష్. అందుకే ఈసారి షూటింగ్ కీలకంగా మారింది.

పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది సర్కారువారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పాటలతో ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నారు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  26 Jan 2022 2:58 AM IST
Next Story