ఈసారి చిరంజీవితోనే షురూ చేస్తారట
అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య చేసిన సందడి అందరికీ తెలిసిందే. ఆహా ఓటీటీ వేదిక కోసం హోస్ట్ అవతారం ఎత్తిన బాలయ్య, పలువురు సినీ ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు చేశారు. అలా 10 ఎపిసోడ్లతో సీజన్-1 ముగించారు. చివరి ఎపిసోడ్ మహేష్ బాబుది. అది త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతోంది. అయితే బాలయ్య, చిరంజీవిని మాత్రం ఇంటర్వ్యూ చేయలేదు. ఈసారి ఆ ముచ్చట తీరబోతోంది. సీజన్-2ను త్వరలోనే ప్రారంభించబోతున్నారు బాలకృష్ణ. అందులో తొలి ఎపిసోడ్ చిరంజీవితోనే ఉండే అవకాశం […]
అన్ స్టాపబుల్ అంటూ బాలయ్య చేసిన సందడి అందరికీ తెలిసిందే. ఆహా ఓటీటీ వేదిక కోసం హోస్ట్ అవతారం ఎత్తిన బాలయ్య, పలువురు సినీ ప్రముఖుల్ని ఇంటర్వ్యూలు చేశారు. అలా 10 ఎపిసోడ్లతో సీజన్-1 ముగించారు. చివరి ఎపిసోడ్ మహేష్ బాబుది. అది త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతోంది. అయితే బాలయ్య, చిరంజీవిని మాత్రం ఇంటర్వ్యూ చేయలేదు. ఈసారి ఆ ముచ్చట తీరబోతోంది.
సీజన్-2ను త్వరలోనే ప్రారంభించబోతున్నారు బాలకృష్ణ. అందులో తొలి ఎపిసోడ్ చిరంజీవితోనే ఉండే అవకాశం ఉంది. బాలయ్య, చిరంజీవి కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పటికే క్రియేటివ్ టీమ్ కసరత్తు పూర్తి చేసింది. అటు చిరంజీవి చెవిలో కూడా మేటర్ వేసింది. తను ఇంటర్వ్యూకు రావడానికి రెడీ అంటూ చిరంజీవి కూడా ఓకే చెప్పారట.
సో.. సీజన్-2 ఎప్పుడు ప్రారంభమైనా అది చిరంజీవి ఇంటర్వ్యూతోనే మొదలవుతుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. కాకపోతే సీజన్-2 ఎప్పుడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఎందుకంటే, బాలయ్య ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయారు. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. మళ్లీ ఆయన ఎప్పుడు ఫ్రీ అవుతారనేది ఆయన చేతుల్లో కూడా లేదు.