Telugu Global
Cinema & Entertainment

గుడ్ లక్ సఖీ ట్రయిలర్ రివ్యూ

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రోజు `గుడ్ లక్ సఖి` థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. దేశంలో టాప్ షూటర్లను తయారుచేస్తానని జ‌గ‌పతిబాబు ప్రకటించడంతో ట్రైల‌ర్‌ ప్రారంభమవుతుంది. బ్యాడ్‌ల‌క్ స‌ఖి గా కీర్తి సురేష్ ప‌రిచ‌యం అవుతుంది. అయితే కీర్తి […]

గుడ్ లక్ సఖీ ట్రయిలర్ రివ్యూ
X

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రోజు 'గుడ్ లక్ సఖి' థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్.

దేశంలో టాప్ షూటర్లను తయారుచేస్తానని జ‌గ‌పతిబాబు ప్రకటించడంతో ట్రైల‌ర్‌ ప్రారంభమవుతుంది. బ్యాడ్‌ల‌క్ స‌ఖి గా కీర్తి సురేష్ ప‌రిచ‌యం అవుతుంది. అయితే కీర్తి పేరును జ‌గ‌ప‌తిబాబుకు సూచిస్తాడు ఆది పినిశెట్టి. ఇంత‌లో షూటింగ్ మహిళల కోసం కాదు అని గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తారు. దాంతో సఖి మళ్లీ దురదృష్టవంతురాలు అని నిరూపించుకుంటుంది. ఫ‌స్ట్ టైమ్ ఆమె టార్గెట్ రీచ్ అవ‌డంతో ఫెయిల్ అవుతుంది. అయితే జ‌గ‌ప‌తి బాబు ఆమెను ల‌క్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రేరేపిస్తారు.

స్ఫూర్తిదాయకమైన కంటెంట్ తో ట్రైలర్ అంద‌రినీ ఆకట్టుకుంది. అన్ని కమర్షియల్ అంశాల‌ను చేర్చి ఒక ప‌ర్‌ఫెక్ట్ కమర్షియల్ మూవీగా ఈ సినిమాను మ‌లిచాడు ద‌ర్శ‌కుడు నగేష్ కుకునూర్. చిరంతన్ దాస్ విజువ‌ల్స్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి.

'గుడ్ లక్ సఖి' సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో జ‌న‌వ‌రి 28న ఈ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది.

First Published:  24 Jan 2022 1:47 PM IST
Next Story