విజయ్ దేవరకొండ సినిమాలో సమంత
విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఇదివరకే ఓ సినిమా చేశారు. అదే మహానటి. కానీ అందులో వీళ్లిద్దరూ కలిసి నటించిన విషయాన్ని చాలామంది మరిచిపోయారు. ఆ సంగతి పక్కనపెడితే, ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ సినిమాలో సమంత కనిపించబోతోందనే ప్రచారం మొదలైంది. అదే లైగర్ సినిమా. ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఆ పాటను సమంతతో చేయాలని భావిస్తోంది యూనిట్. ఈ […]

విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఇదివరకే ఓ సినిమా చేశారు. అదే మహానటి. కానీ అందులో వీళ్లిద్దరూ కలిసి నటించిన విషయాన్ని చాలామంది మరిచిపోయారు. ఆ సంగతి పక్కనపెడితే, ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ సినిమాలో సమంత కనిపించబోతోందనే ప్రచారం మొదలైంది. అదే లైగర్ సినిమా.
ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఆ పాటను సమంతతో చేయాలని భావిస్తోంది యూనిట్. ఈ మేరకు సమంతతో సంప్రదింపులు మొదలుపెట్టారు కూడా. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఉంది సమంత. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ ఐటెంసాంగ్ పై ఓ నిర్ణయం తీసుకోనుంది.
రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాలో ఐటెంసాంగ్ చేసింది సమంత. ఆ సాంగ్ దేశవ్యాప్తంగా హిట్టయింది. సో.. తమ పాన్ ఇండియా సినిమా లైగర్ లోకి కూడా సమంతను తీసుకుంటే బాగుంటుందనేది యూనిట్ ఆలోచన. ఈ మేరకు సమంతను ఒప్పించేందుకు స్వయంగా విజయ్ దేవరకొండ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.