సుమంత్ సినిమాకు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సుమంత్ నటించిన ‘మళ్లీ మొదలైంది’ అనే సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోందనే విషయాన్ని గతంలోనే బ్రేక్ చేశాం. ఇప్పుడా స్ట్రీమింగ్ డేట్ బయటకొచ్చింది. మళ్లీ మొదలైంది సినిమా ఫిబ్రవరి 11న జీ5లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మేరకు సదరు సంస్థ నుంచి, ఇటు ప్రొడ్యూసర్ల నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. సాధారణంగా డైరక్ట్ స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాలపై మేకర్స్ పెద్దగా దృష్టిపెట్టరు. విడుదలకు ముందు ఇంటర్వ్యూలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. గతంలో టక్ […]
సుమంత్ నటించిన ‘మళ్లీ మొదలైంది’ అనే సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోందనే విషయాన్ని గతంలోనే బ్రేక్ చేశాం. ఇప్పుడా స్ట్రీమింగ్ డేట్ బయటకొచ్చింది. మళ్లీ మొదలైంది సినిమా ఫిబ్రవరి 11న జీ5లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మేరకు సదరు సంస్థ నుంచి, ఇటు ప్రొడ్యూసర్ల నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
సాధారణంగా డైరక్ట్ స్ట్రీమింగ్ కు వచ్చే సినిమాలపై మేకర్స్ పెద్దగా దృష్టిపెట్టరు. విడుదలకు ముందు ఇంటర్వ్యూలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. గతంలో టక్ జగదీశ్ విడుదల టైమ్ లో నాని కూడా ఇదే చేశాడు. కానీ మళ్లీ మొదలైంది సినిమా కోసం మాత్రం నిర్మాతలు కాస్త గట్టిగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఓ కారణం ఉంది.
సుమంత్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది రెడ్ సినిమాస్ అనే సంస్థ. నిర్మాత రాజశేఖర్ రెడ్డికి ఇదే తొలి సినిమా. అందుకే సినిమాకు కాస్త గట్టిగా ప్రచారం కల్పించి, తన బ్యానర్ పేరును హైలెట్ చేసుకోవాలని భావిస్తున్నారు.
సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా చేసింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. తనకు విడాకులు ఇప్పించిన లాయర్ తోనే హీరో ప్రేమలో పడే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది.