Telugu Global
National

మహాత్ముడికి ఇష్టమైన పాట ఇక వినిపించదు.. రిపబ్లిక్ డే పరేడ్ పై మరో దుమారం..

ఇప్పటికే రిపబ్లిక్ డే పరేడ్ పై శకటాల దుమారం రేగింది. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల శకటాలపై కేంద్రం ప్రేమ చూపిస్తోందని, మిగతా రాష్ట్రాలను పక్కనపెట్టిందని, చివరికి పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన నేతాజీ శకటానికి కూడా అనుమతి లభించలేదని, కేంద్రం వివక్షతకు ఇదే నిదర్శనం అనే ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు మరో దుమారం మొదలైంది. మహాత్మా గాంధీకి అత్యంత ఇష్టమైన పరేడ్ పాటగా గుర్తింపు ఉన్న ‘అబైడ్ విత్ మి’ కి ఈ ఏడాది నుంచి చోటు […]

మహాత్ముడికి ఇష్టమైన పాట ఇక వినిపించదు.. రిపబ్లిక్ డే పరేడ్ పై మరో దుమారం..
X

ఇప్పటికే రిపబ్లిక్ డే పరేడ్ పై శకటాల దుమారం రేగింది. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాల శకటాలపై కేంద్రం ప్రేమ చూపిస్తోందని, మిగతా రాష్ట్రాలను పక్కనపెట్టిందని, చివరికి పశ్చిమబెంగాల్ నుంచి వచ్చిన నేతాజీ శకటానికి కూడా అనుమతి లభించలేదని, కేంద్రం వివక్షతకు ఇదే నిదర్శనం అనే ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు మరో దుమారం మొదలైంది. మహాత్మా గాంధీకి అత్యంత ఇష్టమైన పరేడ్ పాటగా గుర్తింపు ఉన్న ‘అబైడ్ విత్ మి’ కి ఈ ఏడాది నుంచి చోటు లేకుండా చేసింది కేంద్రం.

రిపబ్లిక్ డే వేడుకలకు చివరిగా బీటింగి రిట్రీట్ పేరుతో జరిగే కార్యక్రమంలో ఆర్మీ బ్యాండ్ ట్రూప్ కొన్ని పాటల్ని బ్యాండ్ వాయిద్య పరికరాలపై శ్రావ్యంగా వినిపిస్తుంది. ఢిల్లీలోని విజయ్ చౌక్ లో ప్రతి ఏడాదీ జనవరి 29 సాయంత్రం ఈ కార్యక్రమం జరుగుతుంది. రిపబ్లిక్ డే వేడుకలకు ముగింపుగా దీన్ని నిర్వహిస్తారు. ప్రతిరోజూ యుద్ధం నుంచి సైనికులు తిరిగి వచ్చే సమయానికి బీటింగ్ రిట్రీట్ నిర్వహించడం ఆనవాయితీ. యుద్ధ సమయం పాటించే ఆ ఆనవాయితీని.. భారత రిపబ్లిక్ డే వేడుకల చివరి ఘట్టంగా భావించే జనవరి 29న విజయ్ చౌక్ లో నిర్వహిస్తుంటారు. ఆర్మీ బ్యాండ్ ట్రూప్ పాటలు ఈ ఘట్టంలో ప్రత్యేక ఆకర్షణ. ప్రతి ఏడాదీ ఈ కార్యక్రమంలో 4 పాటలు ఆలపిస్తుంటారు. ఈ ఏడాది అందులో ‘అబైడ్ విత్ మి’ని తొలగించారు.

మహాత్ముడికి అత్యంత ఇష్టమైన పాటగా ‘అబైడ్ విత్ మి’ని చెబుతారు. 2020లోనే ఈ పాటను బీటింగ్ రిట్రీట్ నుంచి తొలగించాలని ప్రయత్నించారు. అయితే ఈ పాటపై సామాజిక ముద్ర వేస్తూ.. తొలగించడాన్ని సోషల్ మీడియాలో ప్రజలు తీవ్రంగా ఖండించారు. మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దీంతో అప్పట్లో ప్రభుత్వం వెనకడుగు వేసింది. తిరిగి ఇప్పుడు మళ్లీ ఈ పాట విషయంలో జోక్యం చేసుకుంది. ఈ ఏడాది జరిగే బీటింగ్ రిట్రీట్ లో ‘అబైడ్ విత్ మి’కి స్థానం లేదని తేలిపోయింది.

First Published:  23 Jan 2022 3:06 AM IST
Next Story