ప్రభాస్ తో మారుతి సినిమా ఉంటుందా?
ఈరోజు ఉదయం నుంచి ఒకటే హంగామా. ప్రభాస్-మారుతి సినిమా లాక్ అయిందంటూ ప్రచారం. యూవీ క్రియేషన్స్, భగవాన్ నిర్మాతలుగా వస్తోందంటూ కథనాలు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టారని కొందరు రాసుకొచ్చారు. వేసవి ముగిసిన వెంటనే సినిమా స్టార్ట్ అవుతుందని, ప్రభాస్ అన్ని సినిమాల కంటే ఇదే ముందు వస్తుందని మరికొందరు పోస్టులు పెట్టారు. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే. 24 గంటలుగా నడుస్తున్న ఈ ప్రచారానికి తనదైన శైలిలో ఫుల్ స్టాప్ […]
ఈరోజు ఉదయం నుంచి ఒకటే హంగామా. ప్రభాస్-మారుతి సినిమా లాక్ అయిందంటూ ప్రచారం. యూవీ క్రియేషన్స్, భగవాన్ నిర్మాతలుగా వస్తోందంటూ కథనాలు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ పెట్టారని కొందరు రాసుకొచ్చారు. వేసవి ముగిసిన వెంటనే సినిమా స్టార్ట్ అవుతుందని, ప్రభాస్ అన్ని సినిమాల కంటే ఇదే ముందు వస్తుందని మరికొందరు పోస్టులు పెట్టారు.
అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే. 24 గంటలుగా నడుస్తున్న ఈ ప్రచారానికి తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టాడు దర్శకుడు మారుతి. తన సినిమా కథ, జానర్, నటీనటులపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయని, కాలమే వాటన్నింటికీ సమాధానం చెబుతుందంటూ ట్వీట్ చేశాడు. ఇలా ఈ పుకార్లను మారుతి ఖండించలేదు, అలా అని సమర్థించనూ లేదు.
ఈ గాసిప్స్ సంగతి పక్కనపెడితే.. ప్రభాస్ ఓ మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసి చాన్నాళ్లయింది. మారుతి కాంబోలో ఓ మంచి కుటుంబకథా చిత్రమ్ వస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం వీళ్లిద్దరి కాంబోలో హారర్-కామెడీ వస్తుందంటున్నారు.