Telugu Global
Cinema & Entertainment

'జయమ్మ' అసలు రూపం ఇది

జయమ్మ పంచాయితీ టీజర్ ఇప్పటికే రిలీజైంది. అందులో సుమ కనకాల పాత్ర ఏంటి? ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోందనే అంశాలు ఆసక్తి రేకెత్తించాయి. ఇప్పుడు జయమ్మ అసలు స్వరూపం ఏంటో బయటపడింది. సినిమాలో జయమ్మ పాత్ర ఏంటనే విషయాన్ని వివరిస్తూ ఓ పాట ఉంది. ఈరోజు ఆ పాటను విడుదల చేశారు. దర్శకుడు రాజమౌళి ఈరోజు జయమ్మ పంచాయితీ` టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. టైటిల్ రోల్‌ను సుమ కనకాల పోషించ‌గా వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించారు. […]

జయమ్మ అసలు రూపం ఇది
X

జయమ్మ పంచాయితీ టీజర్ ఇప్పటికే రిలీజైంది. అందులో సుమ కనకాల పాత్ర ఏంటి? ఆమె ఎందుకలా ప్రవర్తిస్తోందనే అంశాలు ఆసక్తి రేకెత్తించాయి. ఇప్పుడు జయమ్మ అసలు స్వరూపం ఏంటో బయటపడింది. సినిమాలో జయమ్మ పాత్ర ఏంటనే విషయాన్ని వివరిస్తూ ఓ పాట ఉంది. ఈరోజు ఆ పాటను విడుదల చేశారు.

దర్శకుడు రాజమౌళి ఈరోజు జయమ్మ పంచాయితీ' టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. టైటిల్ రోల్‌ను సుమ కనకాల పోషించ‌గా వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించారు. విజయ్ కుమార్ కలివరపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

చిత్రం గురించి చెప్పాలంటే, ప్రముఖ యాంకర్, బుల్లితెర వ్యాఖ్యాత, హోస్ట్ అయిన సుమ కనకాల పల్లెటూరి డ్రామా చిత్రమే 'జయమ్మ పంచాయితీ'. ప్ర‌ధాన పాత్ర‌తో సుమ‌ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్ర గురించి చిత్ర యూనిట్ ప్ర‌చారం మొద‌లు పెట్టింది. ఇటీవ‌లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ త‌ర్వాత‌ నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈరోజు ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించారు.

ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ నటించింద‌నేది ఈరోజు విడుద‌లైన టైటిల్ సాంగ్‌లో క‌నిపిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంద‌ర్భానుసారంగా బాణీలు స‌మ‌కూర్చారు. దీనికి శ్రీకృష్ణ గాత్రం అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు. ఈ పాట ఫన్నీ విజువల్స్‌తో ఆక‌ట్టుకునేలా వుంది.

First Published:  16 Jan 2022 12:58 PM IST
Next Story