ఆన్ లైన్ క్లాస్ లకి సిద్ధంకండి..
సంక్రాంతి సెలవల తర్వాత సోమవారం నుంచి పిల్లలంతా స్కూళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో స్కూళ్లకు సెలవలు నిరవధికంగా పొడిగించే అవకాశం కనిపిస్తోంది. మళ్లీ పాతరోజుల్లోకి, అంటే ఆన్ లైన్ క్లాస్ లకి ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. కేరళ మొదటగా ఈ నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మరో రెండు వారాలపాటు ఆఫ్ లైన్ క్లాస్ లు లేవని, ఆన్ లైన్ క్లాస్ లు మాత్రమే జరుగుతాయని ప్రకటించారు అధికారులు. తెలంగాణలో కూడా […]
సంక్రాంతి సెలవల తర్వాత సోమవారం నుంచి పిల్లలంతా స్కూళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో స్కూళ్లకు సెలవలు నిరవధికంగా పొడిగించే అవకాశం కనిపిస్తోంది. మళ్లీ పాతరోజుల్లోకి, అంటే ఆన్ లైన్ క్లాస్ లకి ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. కేరళ మొదటగా ఈ నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మరో రెండు వారాలపాటు ఆఫ్ లైన్ క్లాస్ లు లేవని, ఆన్ లైన్ క్లాస్ లు మాత్రమే జరుగుతాయని ప్రకటించారు అధికారులు. తెలంగాణలో కూడా ఆన్ లైన్ క్లాస్ ల విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈనెల 17 నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఇప్పటికే హైదరాబాద్ జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం కూడా కొవిడ్ ఆంక్షలను ఈనెల 20వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో ఎలిమెంటరీ, హైస్కూళ్ల విషయంలో ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులపై కీలక నిర్ణయం ప్రకటిస్తుందని అంటున్నారు. ఇప్పడికే ఢిల్లీ, పశ్చిమబెంగాల్ లో విద్యా సంస్థలు మూతబడ్డాయి, అక్కడ ఆన్ లైన్ క్లాస్ లు మాత్రమే జరుగుతున్నాయి.
హర్యానాలో టీకా వేయించుకుంటేనే స్కూల్ లోకి అనుమతి..
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ గణనీయంగా పెరిగిపోతున్న క్రమంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న విద్యార్థులకే పాఠశాలల్లోకి అనుమతి అంటూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వారికి కొవిడ్ ఫస్ట్ డోస్ ఇస్తున్నారు. ఆ వయసు కల విద్యార్థులు టీకా తీసుకుంటేనే హర్యానాలో స్కూళ్లలోకి అనుమతిస్తారు.. ఇప్పటి వరకు హర్యానాలో 15 లక్షల మంది విద్యార్థులు కొవిడ్ టీకా తీసుకున్నారు.
ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల విషయంలో మరికొంతకాలం వేచి చూసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణతో పోల్చి చూస్తే కేసుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. ఏపీలో స్కూళ్లను యధావిధిగా నడిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారంతో సెలవలు పూర్తయితే, సోమవారం నుంచి విద్యార్థులు స్కూళ్లకు రాావల్సి ఉంటుంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలపై కూడా క్లారిటీ వచ్చేసింది కాబట్టి.. త్వరగా సిలబస్ పూర్తి చేసేందుకు ఉపాధ్యాయులు కసరత్తులు చేస్తున్నారు.