అనసూయ సినిమాకు అనూప్ సంగీతం
బంగార్రాజు సినిమాతో సూపర్ మ్యూజికల్ హిట్ కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. సంక్రాంతి బరిలో విడుదల అయిన బంగార్రాజు సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ కు కనెక్ట్ అవ్వడానికి పాటలు బాగా దోహదపడ్డాయి. బంగార్రాజు సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన అనూప్ రూబెన్స్ ఇప్పుడు నాన్ స్టాప్ గా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. రీసెంట్ గా జయశంకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు అనూప్ […]
బంగార్రాజు సినిమాతో సూపర్ మ్యూజికల్ హిట్ కొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. సంక్రాంతి బరిలో విడుదల అయిన బంగార్రాజు సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ కు కనెక్ట్ అవ్వడానికి పాటలు బాగా దోహదపడ్డాయి.
బంగార్రాజు సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చిన అనూప్ రూబెన్స్ ఇప్పుడు నాన్ స్టాప్ గా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. రీసెంట్ గా జయశంకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు అనూప్ రూబెన్స్. గతంలో పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలకు దర్శకత్వం వహించిన జయశంకర్.. ఇప్పుడో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నాడు. దీనికి అనూప్ సంగీతం అందిస్తున్నాడు.
ఆర్వీ సినిమాస్ పతాకంపై చికాగోకు చెందిన వ్యాపారవేత్తలు ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తోంది. హెబ్బా పటేల్, సాయికుమార్, అతుల్ కులకర్ణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గతేడాది దృశ్యం-2 లాంటి అద్భుతమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనూప్ చేతిలో ప్రస్తుతం మంచి మంచి ప్రాజెక్టులున్నాయి. యాంగ్రీ మేన్ రాజశేఖర్ నటిస్తున్న శేఖర్, ప్రేమ కాదంట, చేతక్ శ్రీను లాంటి సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడీ మ్యూజిక్ డైరక్టర్ చేతికి జయశంకర్ డైరక్ట్ చేస్తున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ కూడా వెళ్లింది.
అనూప్ రాకతో తమ ప్రాజెక్టుకు మరింత వెయిట్ పెరిగిందంటున్నారు నిర్మాతలు ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి. త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ డీటెయిల్స్ వెల్లడించబోతున్నారు.