Telugu Global
National

ఇండియాలో రోడ్లు.. హీరోయిన్ల బుగ్గలు..

భారత్ రోడ్లు ఎలా ఉంటాయి..? రోజూ గుంతల్లో వెళ్తూ అవస్థలు పడే ప్రయాణికులు గతుకుల రోడ్లపై సెటైర్లు పేలుస్తుంటారు కానీ, రాజకీయ నాయకులు మాత్రం రోడ్లను హీరోయిన్ల బుగ్గలతో పోలుస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా జార్ఖండ్ లోని జ‌మ్తారా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రోడ్ల‌న్నీ ఇకపై హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ బుగ్గ‌ల్లా నున్న‌గా ఉంటాయ‌ని కామెంట్ చేశారు. తన నియోజకవర్గంలో 14 వ‌ర‌ల్డ్ క్లాస్ ర‌హ‌దారుల నిర్మాణం త్వ‌ర‌లో ప్రారంభం అవుతుందని ఆయన […]

ఇండియాలో రోడ్లు.. హీరోయిన్ల బుగ్గలు..
X

భారత్ రోడ్లు ఎలా ఉంటాయి..? రోజూ గుంతల్లో వెళ్తూ అవస్థలు పడే ప్రయాణికులు గతుకుల రోడ్లపై సెటైర్లు పేలుస్తుంటారు కానీ, రాజకీయ నాయకులు మాత్రం రోడ్లను హీరోయిన్ల బుగ్గలతో పోలుస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా జార్ఖండ్ లోని జ‌మ్తారా నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఇర్ఫాన్ అన్సారీ.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని రోడ్ల‌న్నీ ఇకపై హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ బుగ్గ‌ల్లా నున్న‌గా ఉంటాయ‌ని కామెంట్ చేశారు. తన నియోజకవర్గంలో 14 వ‌ర‌ల్డ్ క్లాస్ ర‌హ‌దారుల నిర్మాణం త్వ‌ర‌లో ప్రారంభం అవుతుందని ఆయన ట్విట్టర్లో ఓ వీడియో ఉంచారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. రోడ్లు కంగ‌నా బుగ్గ‌ల్లాగే ఎందుకుండాలి.. నీ చెల్లెలు బుగ్గ‌ల్లా కూడా ఉండొచ్చుకదా అని ప్రశ్నిస్తున్నారు. హీరోయిన్ల బుగ్గ‌ల గురించి మాట్లాడ‌టానికి ముందు నీ త‌ల్లి, చెల్లి బుగ్గ‌ల గురించి మాట్లాడు అని మరికొందరు మండిప‌డ్డారు.

హేమా మాలిని బుగ్గలు..
గతంలో హేమమాలిని, కత్రినాకైఫ్ బుగ్గలతో రోడ్లను పోలుస్తూ కొంతమంది రాజకీయనాయకులు కామెంట్లు చేశారు. 2000 సంవత్సరంలో లాలూ ప్రసాద్ యాదవ్.. బీహార్ లో అధికారంలోకి వచ్చినప్పుడు బీహార్ రహదారులు త్వరలో హేమ మాలిని చెంపలలాగా మారుతాయని అన్నారు. 2019లో మరో రాజకీయ నాయకుడు పిసి శర్మ తన ప్రభుత్వం మధ్యప్రదేశ్ రోడ్లను హేమా మాలిని చెంపల లాగా నున్నగా మార్చేస్తుందని చెప్పి విమర్శలపాలయ్యారు.

ఇటీవల మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత గులాబ్‌రావు పాటిల్ కూడా తన నియోజవర్గంలో అభివృద్ధి ఉరకలెత్తిందని, రోడ్లు బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా ఉంటాయని వ్యాఖ్యానించిన క్షమాపణలు చెప్పారు. పాటిల్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయని మహిళా సంఘాలు విమర్శించాయి. ఆయనపై కేసు కూాడా నమోదు చేశారు. రాజకీయంగా తీవ్రంగా ఒత్తిడి పెరుగుతుండడంతో పాటిల్ క్షమాపణలు చెప్పక తప్పలేదు.

హేమా మాలినే కాదు, ఆ మధ్య కత్రినా కైఫ్ చెంపల వంటి రోడ్లు అంటూ రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేయగా రాజేంద్ర సింగ్‌ స్పందిస్తూ నోరుజారారు. రోడ్లు హేమమాలిని చెంపల్లా ఉండాలంటూనే ఆమె చాలా ఓల్డ్‌ అయిపోయారని వెటకారం చేశారు. తర్వాత కత్రినా కైఫ్‌ పేరును తెచ్చారు. రోడ్లు ఆమె చెంపల్లా ఉండాలన్నారు.

ఒకరిద్దరు కాదు, భారత్ లో చాలామంది రాజకీయ నాయకులు రోడ్ల గురించి ప్రస్తావన వచ్చిప్పుడల్లా హీరోయిన్ల బుగ్గలను గుర్తు చేసుకుంటూ విమర్శలపాలవుతున్నారు.

First Published:  15 Jan 2022 4:21 AM GMT
Next Story