రాజకీయాలకు నేను దూరం.. ఆ వార్తలు అవాస్తవం..
రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, మళ్లీ రాజకీయాల్లోకి, చట్టసభల్లోకి రావడం జరగని పని అని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. సీఎం జగన్ తో భేటీ తర్వాత వచ్చిన పుకార్లపై ఆయన స్పందించారు. జగన్ తనకి రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు పుకార్లు వస్తున్నాయని, వాటిని తాను పూర్తిగా ఖండిస్తున్నానని ప్రకటించారు చిరంజీవి. అవన్నీ వట్టి ఊహాగానాలేనని, అలాంటి వార్తలకి, చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ట్విట్టర్ ద్వారా కోరారు. “తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ […]

రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, మళ్లీ రాజకీయాల్లోకి, చట్టసభల్లోకి రావడం జరగని పని అని క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. సీఎం జగన్ తో భేటీ తర్వాత వచ్చిన పుకార్లపై ఆయన స్పందించారు. జగన్ తనకి రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు పుకార్లు వస్తున్నాయని, వాటిని తాను పూర్తిగా ఖండిస్తున్నానని ప్రకటించారు చిరంజీవి. అవన్నీ వట్టి ఊహాగానాలేనని, అలాంటి వార్తలకి, చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ట్విట్టర్ ద్వారా కోరారు.
“తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.అవన్నీ పూర్తిగా నిరాధారం.”
“రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను.”
అని ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ ట్వీట్లతోపాటు.. #GiveNewsNotViews అనే హ్యాష్ ట్యాగ్ ని కూడా జతచేశారు చిరంజీవి. వ్యూస్ కోసం న్యూస్ ఇవ్వొద్దని మీడియా సంస్థలను కోరారు. చిరంజీవి ట్వీట్ చేసిన వెంటనే.. ఈ హ్యాష్ ట్యాగ్ ని మరికొందరు సినీ నటులు ట్రెండ్ చేస్తున్నారు. మై ఫుల్ సపోర్ట్ అంటూ.. చిరంజీవిని సపోర్ట్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ ని హీరో విజయ్ దేవరకొండ తన ట్విట్టర్లో ఉంచారు.