Telugu Global
NEWS

సినిమా పెద్దగా కాదు.. బిడ్డగా వచ్చా " చిరంజీవి..

ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపుతో ఏర్పడిన గందరగోళ పరిస్థితులపై సీఎం జగన్ తో చర్చలు జరిపారు సినీ నటుడు చిరంజీవి. సీఎంతో స‌మావేశం త‌రువాత ఇండస్ట్రీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికింద‌ని ఆయన తెలిపారు. ఒక్క‌డిగా కంటే, అంద‌రినీ క‌లుపుకొని వ‌చ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌టం త‌న‌కు ఇష్ట‌మ‌ని అన్నారు చిరంజీవి. తెలుగు సినీ రంగానికి పెద్దగా కాకుండా.. ఓ బిడ్డగా వచ్చానని చెప్పారు. జగన్ తో జ‌రిపిన చ‌ర్చ‌లు సంతోషంగా ముగిశాయని, త్వ‌ర‌లోనే అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం […]

సినిమా పెద్దగా కాదు.. బిడ్డగా వచ్చా  చిరంజీవి..
X

ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపుతో ఏర్పడిన గందరగోళ పరిస్థితులపై సీఎం జగన్ తో చర్చలు జరిపారు సినీ నటుడు చిరంజీవి. సీఎంతో స‌మావేశం త‌రువాత ఇండస్ట్రీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరికింద‌ని ఆయన తెలిపారు. ఒక్క‌డిగా కంటే, అంద‌రినీ క‌లుపుకొని వ‌చ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌టం త‌న‌కు ఇష్ట‌మ‌ని అన్నారు చిరంజీవి. తెలుగు సినీ రంగానికి పెద్దగా కాకుండా.. ఓ బిడ్డగా వచ్చానని చెప్పారు. జగన్ తో జ‌రిపిన చ‌ర్చ‌లు సంతోషంగా ముగిశాయని, త్వ‌ర‌లోనే అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సమస్యకు రెండువైపులా..
సినిమా టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారంలో ఒకవైపే కాకుండా.. రెండు వైపులా సమస్యను వినాలని సీఎం జగన్ భావించారని చెప్పారు చిరంజీవి, తనపై న‌మ్మ‌కం, బాధ్యత ఉంచి ఆహ్వానించడం సంతోషంగా ఉందని చెప్పారు. బ‌య‌ట‌కు క‌నిపించే గ్లామ‌ర్ ఫీల్డ్ వెనక ఎంద‌రో కార్మికులు ఉన్నారని, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వారు ఉన్నారని, కరోనా సమయంలో నాలుగైదు నెలలుగా కార్మికులు పనిలేక ఇంట్లోనే ఉండిపోయారని, వారికి గతంలో తాను సరుకులు కూడా అందించానని గుర్తు చేశారు. కార్మికులకోసం ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని, థియేట‌ర్ల‌కు కూడ స‌మ‌స్య‌లున్నాయని, అంద‌రూ అభ‌ద్ర‌తా భావంలో ఉన్నారని, వారి కష్టాలు కూడా పరిగణ లోకి తీసుకొని నిర్మాణాత్మ‌క సూచ‌నలు చేశానని చెప్పారు చిరంజీవి.

సీఎం భరోసా..
తాను వివరించిన విషయాలన్నిటినీ ఒక డ్రాఫ్ట్ గా తయారు చేసి ఇవ్వాలని సీఎం అడిగారని, దానికి పరిశ్రమ ఆమోదం తెలిపితే దాన్నే జీవోగా ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు ఇది శుభవార్త అని అన్నారు. అంద‌రూ సంయ‌మ‌నం పాటించాలని పిలుపునిచ్చారు. ఇక సినిమా టికెట్ రేట్ల విషయంలో క‌మిటీ రిపోర్ట్ పై మ‌రో సారి ఆహ్వ‌నం వ‌స్తే జ‌గ‌న్ ను క‌లుస్తాన‌ని చెప్పారు. కమిటీ ఇచ్చే నివేదికపై కూడా సూచ‌న‌లు ఇస్తామ‌న్నారు. మొత్తమ్మీద సీఎంతో జరిగిన చర్చలు సఫలం అయ్యాయని, త్వరలోనే శుభవార్త వింటామని చెప్పారు.

First Published:  13 Jan 2022 1:40 PM IST
Next Story