Telugu Global
National

యూపీలో సిట్టింగ్ లకు షాకివ్వబోతున్న బీజేపీ..

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రీపోల్స్ అన్నీ బీజేపీదే మరో దఫా విజయం అని జోస్యం చెబుతున్న వేళ.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి అసెంబ్లీ బరిలో దిగకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. పరోక్షంగా బీజేపీకి ఆమె లాభం చేకూర్చేలా ఉన్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ దశలో అధికార బీజేపీ విజయం మరింత సునాయాసంగా మారుతుందని అంచనాలు వేస్తున్నారు చాలామంది. అయితే అనుకోకుండా బీజేపీ […]

యూపీలో సిట్టింగ్ లకు షాకివ్వబోతున్న బీజేపీ..
X

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ప్రీపోల్స్ అన్నీ బీజేపీదే మరో దఫా విజయం అని జోస్యం చెబుతున్న వేళ.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి అసెంబ్లీ బరిలో దిగకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. పరోక్షంగా బీజేపీకి ఆమె లాభం చేకూర్చేలా ఉన్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ దశలో అధికార బీజేపీ విజయం మరింత సునాయాసంగా మారుతుందని అంచనాలు వేస్తున్నారు చాలామంది. అయితే అనుకోకుండా బీజేపీ నుంచి మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సమాజ్ వాదీ పార్టీవైపు చూడటం ఆసక్తికర పరిణామం. ఇక్కడితో ఈ వలసల ఎపిసోడ్ ఆగేలా లేదు. మరో 13మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని శరద్ పవార్ మరో బాంబు పేల్చారు. అయితే శరద్ పవార్, బీజేపీని ఇరుకున పెట్టడానికి ఈ వ్యాఖ్యలు చేశారా, నిజంగానే ఆయన దగ్గర 13మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఉందా అనేది తేలాల్సి ఉంది.

అధిష్టానం దిద్దుబాటు చర్యలు..
403 సీట్ల ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి 313 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే వీరిలో చాలామంది అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మంత్రివర్గంలోనే అసంతృప్తి ఉన్నట్టు స్వామి ప్రసాద్ మౌర్య రాజీనామాతో తేలిపోయింది. ఇక మిగతా ఎమ్మెల్యేలలో కొంతమంది ముందు జాగ్రత్తగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. దీంతో అధిష్టానం కూడా సిట్టింగుల విషయంలో పునరాలోచిస్తోంది.

ఈ సారి దాదాపు 50 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు మొండి చేయి చూపాల‌ని బీజేపీ అధిష్టానం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. వీరి స్థానంలో కొత్త వారికి టిక్కెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. యోగి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లెవ్వ‌రూ అసంతృప్తితో లేర‌ని, కేవ‌లం ఎమ్మెల్యేలు మాత్ర‌మే అసంతృప్తితో ఉన్నార‌న్న‌ది బీజేపీ అధిష్టానం మాట. ఒకవేళ బీజేపీ సిట్టింగ్ లకు మొండి చేయి చూపితే, టికెట్ దక్కనివారంతా పక్క పార్టీలవైపు చూడటం ఖాయం. ఈ చేరికలన్నీ సమాజ్ వాదీ పార్టీకి పరోక్షంగా అనుకూలమనే చెప్పాలి. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యూహం ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో వేచి చూడాలి.

First Published:  12 Jan 2022 6:02 AM IST
Next Story