కోలుకున్న కట్టప్ప.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్
కరోనా బారిన పడిన సత్యరాజ్ కోలుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో 3 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఈ నటుడు, ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు. అయితే ఆయనకు కరోనా తగ్గలేదు. హాస్పిటల్ లో ఉండాల్సిన అవసరం మాత్రం లేదని వైద్యులు సూచించారు. దీంతో హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికొచ్చి ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు సత్యరాజ్. వారం రోజుల పాటు ఐసొలేషన్ లో ఉన్న తర్వాత ఆయనకు మరోసారి కరోనా పరీక్ష నిర్వహిస్తారు. […]
కరోనా బారిన పడిన సత్యరాజ్ కోలుకున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో 3 రోజులుగా చికిత్స తీసుకుంటున్న ఈ నటుడు, ఈ రోజు ఉదయం డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు. అయితే ఆయనకు కరోనా తగ్గలేదు. హాస్పిటల్ లో ఉండాల్సిన అవసరం మాత్రం లేదని వైద్యులు సూచించారు.
దీంతో హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికొచ్చి ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు సత్యరాజ్. వారం రోజుల పాటు ఐసొలేషన్ లో ఉన్న తర్వాత ఆయనకు మరోసారి కరోనా పరీక్ష నిర్వహిస్తారు. టెస్టుల్లో నెగెటివ్ వస్తే సత్యరాజ్ బయటకొస్తారు. ఈలోగా రెగ్యులర్ గా వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనిస్తారు. ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని, వైద్యులు సత్యరాజ్ పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు.
గత శుక్రవారం సత్యరాజ్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆ వెంటనే మీడియాలో పుకార్లు కూడా మొదలయ్యాయి. సత్యరాజ్ పరిస్థితి విషమం అంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు కూడా ఇచ్చేశాయి. కానీ సత్యరాజ్ స్వల్ప కరోనా లక్షణాలతో బయటపడ్డారు.