ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా.. మళ్లీ అప్పుడే..
కరోనా వ్యాప్తి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలుకు ఆదేశాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉన్నట్టుండి వాయిదా వేసింది. నైట్ కర్ఫ్యూ అమలులో మార్పు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిన్న మధ్యాహ్నం కర్ఫ్యూకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. ఈరోజు మధ్యాహ్నానికి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఈరోజు రాత్రి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలి. కానీ, రాష్ట్ర అతిపెద్ద పండుగ సంక్రాంతి […]
కరోనా వ్యాప్తి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ అమలుకు ఆదేశాలిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉన్నట్టుండి వాయిదా వేసింది. నైట్ కర్ఫ్యూ అమలులో మార్పు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిన్న మధ్యాహ్నం కర్ఫ్యూకు ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. ఈరోజు మధ్యాహ్నానికి ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఈరోజు రాత్రి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలి. కానీ, రాష్ట్ర అతిపెద్ద పండుగ సంక్రాంతి నేపథ్యంలో నైట్ కర్ఫ్యూను వాయిదా వేశారు. వివిధ రాష్ట్రాలు, నగరాల్లో ఉండే ఏపీ వాసులు సంక్రాంతి పండుగ సమయంలో సొంత ఊర్లకు వస్తున్నారు. ప్రభుత్వం కూడా పండక్కొచ్చే ప్రయాణికుల కోసం స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. పండగకు సొంత ఊర్లకు వచ్చే వారికి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసి జగన్ సర్కార్.
సంక్రాంతి అనంతరం ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలులోకి రానుంది. ఈనెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నామని ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను సవరించి కొత్త ఉత్తర్వులను విడుదల చేసింది జగన్ ప్రభుత్వం.