బంగార్రాజుకు దసరా బుల్లోడు సెంటిమెంట్
లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ దసరా బుల్లోడు. ఇక నాగార్జున నటించిన తాజా చిత్రం బంగార్రాజు. ఈ రెండు సినిమాల మధ్య సంబంధం ఏమైనా ఉందా? బహుశా ఆ పంచెకట్టు తప్ప మరో సారూప్యత ఉండకపోవచ్చు. కానీ నాగార్జున మాత్రం లింక్ పెట్టాడు. “జనవరి 14న బంగార్రాజు సినిమా రిలీజ్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోకు అది చాలా ముఖ్యమైన తేది. అదే రోజున అన్నపూర్ణ పుట్టింది. దసరా బుల్లోడు అనే సినిమాతో యాభై […]
లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఎవర్ గ్రీన్ క్లాసిక్ దసరా బుల్లోడు. ఇక నాగార్జున నటించిన తాజా చిత్రం బంగార్రాజు. ఈ రెండు సినిమాల మధ్య సంబంధం ఏమైనా ఉందా? బహుశా ఆ పంచెకట్టు తప్ప మరో సారూప్యత ఉండకపోవచ్చు. కానీ నాగార్జున మాత్రం లింక్ పెట్టాడు.
“జనవరి 14న బంగార్రాజు సినిమా రిలీజ్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోకు అది చాలా ముఖ్యమైన తేది. అదే రోజున అన్నపూర్ణ పుట్టింది. దసరా బుల్లోడు అనే సినిమాతో యాభై ఏళ్ల క్రితం నాన్నగారు సంక్రాంతికి దుమ్ములేపారు. అది కూడా మ్యూజికల్ హిట్. ఇప్పుడు బంగార్రాజు కూడా మ్యూజికల్ హిట్. సినిమాకు సగం సక్సెస్ మ్యూజిక్.”
ఇలా బంగార్రాజుకు, దసరా బుల్లోడికి లింక్ పెట్టాడు నాగ్. బంగార్రాజు సినిమాకు అనూప్ మంచి ట్యూన్స్ ఇచ్చాడని, ప్రతి సాంగ్ వజ్రంలా ఉంటుందని చెబుతున్నాడు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఎంత ఊహించుకుంటున్నారో అంతకంటే ఎక్కువగానే సినిమాలో విషయం ఉంటుందని అంటున్నారు నాగ్.
జనవరి 11న బంగార్రాజు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. అదే రోజున ట్రయిలర్ లాంఛ్ చేయబోతున్నారు. జనవరి 14న బంగార్రాజు సినిమా థియేటర్లలోకి రానుంది.