Telugu Global
National

భారత్ లో ఇ-పాస్ పోర్ట్ లు.. టీసీఎస్ తో కుదిరిన డీల్..

భారత్ లో ఇ-పాస్ పోర్ట్ ల జారీకి మరో అడుగు ముందుకు పడింది. దీనికి సంబంధించి టీసీఎస్ కంపెనీతో ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది. మరికొద్ది నెలల్లోనే ఇ-పాస్ పోర్ట్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడున్న పాస్ పోర్ట్ లో కొత్తగా ఓ ఎలక్ట్రానిక్ చిప్ ను జత చేస్తారు. ఆ చిప్ లో సదరు వ్యక్తికి సంబంధించిన డేటా అంతా ఉంటుంది. అత్యథిక భద్రతా ప్రమాణాలతో దీన్ని రూపొందించబోతున్నారు. ఇకపై దొంగ […]

భారత్ లో ఇ-పాస్ పోర్ట్ లు.. టీసీఎస్ తో కుదిరిన డీల్..
X

భారత్ లో ఇ-పాస్ పోర్ట్ ల జారీకి మరో అడుగు ముందుకు పడింది. దీనికి సంబంధించి టీసీఎస్ కంపెనీతో ప్రభుత్వం 6 వేల కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకుంది. మరికొద్ది నెలల్లోనే ఇ-పాస్ పోర్ట్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడున్న పాస్ పోర్ట్ లో కొత్తగా ఓ ఎలక్ట్రానిక్ చిప్ ను జత చేస్తారు. ఆ చిప్ లో సదరు వ్యక్తికి సంబంధించిన డేటా అంతా ఉంటుంది. అత్యథిక భద్రతా ప్రమాణాలతో దీన్ని రూపొందించబోతున్నారు. ఇకపై దొంగ పాస్ పోర్ట్ ల బెడద పూర్తిగా తప్పిపోతుందని చెబుతున్నారు అధికారులు.

2008లో మొదలు..
2008లోనే భారత్ లో ఇ-పాస్ పోర్ట్ లకు బీజం పడింది. అప్పట్లో తొలి విడత 20వేలమంది అధికారులకు వీటిని మంజూరు చేశారు. అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు తొలిసారిగా ఇ-పాస్ పోర్ట్ ని అందించారు. అయితే ఆ తర్వాత దీనికి చాలా మార్పులు, చేర్పులు జరిగాయి. చివరకు చిప్ టెక్నాలజీతో ఈ ఏడాది దీన్ని తెరపైకి తేబోతున్నారు. ట్యాంపరింగ్ చేయాలని చూసినా ఇట్టే తెలిసిపోయే టెక్నాలజీ వాడుతున్నారు.

ప్రస్తుతం మనం ఉపయోగించే పాస్ పోర్ట్స్ లో మెషిన్ రీడబుల్ ట్రావెల్ డాక్యుమెంట్ (MRTD) అనేది ఉంటుంది. పాస్ పోర్ట్ కింది భాగంలో రెండు లైన్లు దీన్ని సూచిస్తాయి. వీటి ద్వారా కొంతమేర టెక్నాలజీని అందిపుచ్చుకున్నట్టయింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో చిప్ బేస్డ్ పాస్ పోర్ట్ లను రూపొందిస్తున్నారు. విదేశాంగ శాఖ త్వరలోనే వీటి జారీకి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తుంది. ఇప్పటికే పాస్ పోర్ట్ లు ఉన్నవారు, కొత్తగా తీసుకోవాలనుకుంటున్నవారు.. ఇ-పాస్ పోర్ట్ కి మారిపోవాల్సిందే.

First Published:  8 Jan 2022 9:18 PM GMT
Next Story