Telugu Global
Cinema & Entertainment

మరోసారి క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్

ఈ ఏడాది మోస్ట్ ఎవైటింగ్ పాన్ ఇండియా మూవీస్ లిస్ట్ లో కేజీఎఫ్-2 కూడా ఒకటి. ఈ సినిమా కోసం కన్నడ , తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది. యష్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఇప్పటికే 2-3 సార్లు వాయిదా […]

మరోసారి క్లారిటీ ఇచ్చిన కేజీఎఫ్
X

ఈ ఏడాది మోస్ట్ ఎవైటింగ్ పాన్ ఇండియా మూవీస్ లిస్ట్ లో కేజీఎఫ్-2 కూడా ఒకటి. ఈ సినిమా కోసం కన్నడ , తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది. యష్ -ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

అయితే ఈ సినిమా ఇప్పటికే 2-3 సార్లు వాయిదా పడింది. ఆమధ్య ఏప్రిల్ 14 రిలీజ్ అంటూ ప్రకటించారు. ఆ తేదీ నుంచి కూడా తప్పుకున్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై మేకర్స్ స్పందించారు. ఈరోజు యష్ బర్త్ డే పోస్టర్ తో మరోసారి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. చెప్పినట్లే అదే డేట్ కి సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు.

నిజానికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వాయిదాల తర్వాత కేజీఎఫ్2 కూడా వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇంతకుముందు చెప్పిన ఏప్రిల్ 14కే వస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

సినిమాకు సంబంధించి ఫిబ్రవరి లేదా మార్చి నెల నుండి భారీ ప్రమోషన్స్ ప్రారంభించే ఆలోచనలో యూనిట్ ఉంది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టాండన్ ముఖ్య పాత్రలో కనిపించనుంది.

First Published:  8 Jan 2022 12:47 PM IST
Next Story