భారత్ లో ఒక్కరోజులోనే లక్ష దాటిన కరోనా కేసులు..
భారత్ లో కరోనా కల్లోలం మళ్లీ తారా స్థాయికి చేరుకుంటోంది. ఒక్క రోజులోనే లక్షకు పైగా కొత్త కేసులు వెలుగులోకి రావడమే దీనికి తాజా నిదర్శనం. గడచిన 24 గంటల్లో భారత్ లో 1,17,100 కేసులు కొత్తగా నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ప్రస్తుతం భారత్ లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363కి చేరింది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 15,13,377 మంది కొవిడ్ పరీక్షలు చేయించుకోగా, వారిలో 1,17,100 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. […]
భారత్ లో కరోనా కల్లోలం మళ్లీ తారా స్థాయికి చేరుకుంటోంది. ఒక్క రోజులోనే లక్షకు పైగా కొత్త కేసులు వెలుగులోకి రావడమే దీనికి తాజా నిదర్శనం. గడచిన 24 గంటల్లో భారత్ లో 1,17,100 కేసులు కొత్తగా నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే ప్రస్తుతం భారత్ లో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363కి చేరింది. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 15,13,377 మంది కొవిడ్ పరీక్షలు చేయించుకోగా, వారిలో 1,17,100 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.74 శాతానికి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1.05 శాతానికి చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 3,007కి పెరిగింది.
10రోజుల్లోనే 13 రెట్లు పెరుగుదల..
కరోనా కేసుల్లో పెరుగుదల ఆందోళనకరంగా ఉంది. గత 10రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో టెస్ట్ ల సంఖ్య కూడా భారీగా పెంచడం, పండగ సీజన్లో ప్రయాణాలు, సమూహాలుగా తిరగడం, షాపింగ్ లు.. ఇతర వ్యవహారాలన్నీ కొవిడ్ వ్యాప్తికి తోడయ్యాయని తెలుస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తమిళనాడులో వీకెండ్ కర్ఫ్యూ పెట్టారు. స్కూళ్లు మూసివేశారు, థియేటర్లు కొన్నిచోట్ల మూసేశారు, మరికొన్ని చోట్ల 50శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.
పడిపోయిన రికవరీ రేటు..
దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల వ్యవధిలో 302 మంది కొవిడ్ తో మరణించారు. కొవిడ్ బయటపడిన తర్వాత ఇప్పటి వరకు 4.8 లక్షల మంది కొవిడ్ కారణంగా చనిపోయారు. మొత్తం 3.43 కోట్లమంది వైరస్ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 97.57 శాతానికి పడిపోయింది.
149 కోట్ల టీకాల పంపిణీ..
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 149 కోట్ల డోసుల టీకా పంపిణీ చేశారు. జనవరి 3నుంచి టీనేజర్లకు కూడా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. నాలుగురోజులుగా 1.64కోట్ల మంది టీనేజర్లకు కొవిడ్ టీకాలు అందించారు. ఇక జనవరి 10నుంచి ప్రికాషనరీ డోస్ టీకా ఇవ్వాల్సి ఉంది.