Telugu Global
National

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు..!

లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను వ్యయ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా గురువారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల సవరణ నిబంధనలు -2022 అనే పేరుతో ఈ ఉత్తర్వులను విడుదల చేసింది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తర ప్రదేశ్, […]

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు..!
X

లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకుగాను వ్యయ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా గురువారం రాత్రి కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల సవరణ నిబంధనలు -2022 అనే పేరుతో ఈ ఉత్తర్వులను విడుదల చేసింది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.

ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలకు అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు మేలు చేకూర్చనుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం నిర్వహించేందుకు, సభలు సమావేశాలు నిర్వహించేందుకు, కరపత్రాలు, బ్యానర్లు తదితర ప్రచార సామాగ్రికిగాను ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.

అయితే కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన మేరకు పరిమితికి లోబడి మాత్రమే ఈ ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఎన్నికల సంఘం సూచించిన మేరకు మాత్రమే ఖర్చు పెట్టి ఎన్నికల వరకు వెళ్లడం అభ్యర్థులకు అసాధ్యంగా మారింది. దీంతో అభ్యర్థులు నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికల సమయంలో ఖర్చు పెడుతుంటారు. దీనిపై ఎన్నికల సంఘం తగిన చర్యలు కూడా తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ప్రకారం దేశంలో చాలా రాష్ట్రాల్లో లోక్ సభ స్థానానికి ఎన్నికల వ్యయ పరిమితిని రూ. 95 లక్షలకు పెంచింది. అలాగే అసెంబ్లీ స్థానానికి వ్యయ పరిమితిని రూ. 40 లక్షలుగా నిర్ణయించింది. అయితే ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలకు ఒకేలా వ్యయ పరిమితిని నిర్ణయించలేదు. కొన్ని రాష్ట్రాలకు ఈ వ్యయ పరిమితిలో తేడా ఉంది.

గోవా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలకు వ్యయ పరిమితి రూ. 75 లక్షలుగా నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికలకు వ్యయ పరిమితి రూ.28 లక్షలుగా నిర్ణయించింది. మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు కూడా ఇంతే మొత్తాన్ని వ్యయ పరిమితిగా నిర్ణయించింది.

First Published:  7 Jan 2022 7:29 AM IST
Next Story