Telugu Global
National

ఇంగ్లిష్ లోనే మాట్లాడండి.. కోర్టు భాష అదే.. -గుజరాత్ ధర్మాసనం..

ఇంగ్లిష్ లోనే మాట్లాడండి.. కోర్టు భాష అదేనంటో ఓ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్. ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్, జస్టిస్ ఏజే శాస్త్రితో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న విశాల్ వ్యాస్ అనే జర్నలిస్ట్ గుజరాతీలో సమాధానం చెబుతుండగా న్యాయమూర్తులు అతడిని వారించారు. ఇంగ్లిష్ లో మాట్లాడాలని సూచించారు. అలా మాట్లాడితేనే తమకు అర్థమవుతుందని, అవసరమనుకుంటే లాయర్ ని నియమించుకోవాలని, లేదా […]

ఇంగ్లిష్ లోనే మాట్లాడండి.. కోర్టు భాష అదే.. -గుజరాత్ ధర్మాసనం..
X

ఇంగ్లిష్ లోనే మాట్లాడండి.. కోర్టు భాష అదేనంటో ఓ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్. ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్, జస్టిస్ ఏజే శాస్త్రితో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న విశాల్ వ్యాస్ అనే జర్నలిస్ట్ గుజరాతీలో సమాధానం చెబుతుండగా న్యాయమూర్తులు అతడిని వారించారు. ఇంగ్లిష్ లో మాట్లాడాలని సూచించారు. అలా మాట్లాడితేనే తమకు అర్థమవుతుందని, అవసరమనుకుంటే లాయర్ ని నియమించుకోవాలని, లేదా గుజరాత్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సాయం తీసుకోవాలని సూచించారు. కానీ సదరు జర్నలిస్ట్ లాయర్ సాయం లేకుండా తన వివరణను గుజరాతీలోనే ఇవ్వడం విశేషం.

‘సామ్నా భ్రష్టాచార్ కా’ అనే పత్రికలో వచ్చిన ఓ ఆర్టికల్ పై 2014లో కేసు నమోదైంది. అప్పటినుంచి ఆ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా విచారణకు హాజరైన జర్నలిస్ట్ విశాల్ వ్యాస్ గుజరాతీలో సమాధానం చెప్పడంతో న్యాయమూర్తులు అడ్డుకున్నారు. ఇంగ్లిష్ లో మాట్లాడవలసిందిగా సూచించారు. అయితే అతను అందుకు విరుద్ధంగా గుజరాతీలోనే తన వివరణ కొనసాగించడంతో.. దాన్ని స్వీకరించలేమని తెలిపారు జడ్జిలు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348 ప్రకారం హైకోర్టు భాషను ఇంగ్లిష్ గానే నిర్థారించారని గుర్తు చేశారు.

కోర్టు తీర్పులు, వాద ప్రతివాదాలు ప్రాంతీయ భాషల్లో జరిగితే కక్షిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఇటీవల ఓ ఉద్యమం మొదలైన సంగతి తెలిసిందే. ఈమేరకు వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లను కలసి సామాజిక ఉద్యమకారులు వినతిపత్రాలు అందించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా వివిధ ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసి విడుదల చేయడం మొదలైంది. సుప్రీంకోర్టులో వెలువడే ముఖ్యమైన తీర్పులను తెలుగులో కూడా అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో గుజరాత్ హైకోర్ట్ మాత్రం ఇంగ్లిష్ లోనే స్పందించాలని కోరడం విశేషం.

First Published:  6 Jan 2022 4:53 AM IST
Next Story