Telugu Global
Cinema & Entertainment

సమంత.. కొత్త ఏడాదిలో కొత్త షెడ్యూల్

సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. నూతన సంవత్సర వేడుకల కోసం దాదాపు వారం రోజులు గ్యాప్ తీసుకున్న సమంత.. కొత్త ఏడాదిలో కొత్తగా ఈ సినిమా సెకెండ్ […]

సమంత.. కొత్త ఏడాదిలో కొత్త షెడ్యూల్
X

సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ మొదలైంది.

నూతన సంవత్సర వేడుకల కోసం దాదాపు వారం రోజులు గ్యాప్ తీసుకున్న సమంత.. కొత్త ఏడాదిలో కొత్తగా ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఇది పూర్తయిన వెంటనే డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఓకే చెప్పిన సినిమాను స్టార్ట్ చేయనుంది. ఇక యశోద విషయానికొస్తే.. ఈనెల 12 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది. కీలకమైన నటీనటులపై సన్నివేశాలు తీస్తున్నారు.

ఈ షెడ్యూల్ ను మరో 4 రోజుల్లో పూర్తిచేస్తారు. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు.. మార్చి నెలాఖరుకు షూటింగ్ పూర్తిచేసి, ఆ తర్వాత మంచి టైమ్ చూసి.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో యశోదను విడుదల చేయాలనేది కృష్ణప్రసాద్ ఆలోచన.

వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  6 Jan 2022 4:34 PM IST
Next Story