Telugu Global
Cinema & Entertainment

మళ్లీ వాయిదా పడిన విశాల్ సినిమా

లెక్కప్రకారం ఈ సంక్రాంతికి బంగార్రాజుకు పోటీగా విశాల్ నటించిన సామాన్యుడు సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడీ సినిమా వాయిదా పడింది. జనవరి 14న రిలీజ్ అవ్వాల్సిన సామాన్యుడు సినిమాను, జనవరి 26కు వాయిదా వేశారు. దీనికి కారణం తెలుగు సినిమాల తాకిడి కాదు. కోలీవుడ్ ప్రభావం. కరోనా థర్డ్ వేవ్ మొదలైన వేళ.. తమిళనాడులో సరికొత్త ఆంక్షలు విధించారు. వాటి ప్రభావం తమిళనాట థియేట్రికల్ వ్యవస్థపై పడింది. దీంతో అజిత్ లాంటి స్టార్ హీరో నటించిన […]

మళ్లీ వాయిదా పడిన విశాల్ సినిమా
X

లెక్కప్రకారం ఈ సంక్రాంతికి బంగార్రాజుకు పోటీగా విశాల్ నటించిన సామాన్యుడు సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడీ సినిమా వాయిదా పడింది. జనవరి 14న రిలీజ్ అవ్వాల్సిన సామాన్యుడు సినిమాను, జనవరి 26కు వాయిదా వేశారు. దీనికి కారణం తెలుగు సినిమాల తాకిడి కాదు. కోలీవుడ్ ప్రభావం.

కరోనా థర్డ్ వేవ్ మొదలైన వేళ.. తమిళనాడులో సరికొత్త ఆంక్షలు విధించారు. వాటి ప్రభావం తమిళనాట థియేట్రికల్ వ్యవస్థపై పడింది. దీంతో అజిత్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమాను సైతం వాయిదా వేశారు. దీంతో విశాల్ కూడా తప్పనిసరి పరిస్థితుల మధ్య తన సినిమాను కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

తమిళనాట విశాల్ సినిమా పోస్ట్ పోన్ అయింది కాబట్టి, ఆ ప్రభావం తెలుగు వెర్షన్ రిలీజ్ పై కూడా పడింది. అయితే జనవరి 26ను రిలీజ్ డేట్ గా ప్రకటించినప్పటికీ, జనాలకు మాత్రం ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పటికి తమిళనాట థియేట్రికల్ వ్యవస్థ గాడిన పడకపోతే, ఈ సినిమా మరోసారి వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది.

డింపుల్ హయతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో శరవణన్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

First Published:  6 Jan 2022 4:28 PM IST
Next Story