Telugu Global
National

నాలుగు గంటల్లోనే ఒమిక్రాన్ ఫలితం.. కొత్త టెస్టింగ్ కిట్ ఆవిష్కరణ..!

ఒమిక్రాన్ వేరియంట్ యావత్ ప్రపంచానికి వణుకు పుట్టిస్తోంది. కేసులు శరవేగంగా పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,630 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కాగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఫలితం వెంటనే వస్తున్నప్పటికీ అది ఒమిక్రాన్ వేరియంటా.. కాదా.. అని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతోంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ ను కనుగొనేందుకోసం జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని ఫలితం కోసం రోజుల తరబడి బాధితులు ఎదురుచూడాల్సిన […]

నాలుగు గంటల్లోనే ఒమిక్రాన్ ఫలితం.. కొత్త టెస్టింగ్ కిట్ ఆవిష్కరణ..!
X

ఒమిక్రాన్ వేరియంట్ యావత్ ప్రపంచానికి వణుకు పుట్టిస్తోంది. కేసులు శరవేగంగా పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,630 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కాగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఫలితం వెంటనే వస్తున్నప్పటికీ అది ఒమిక్రాన్ వేరియంటా.. కాదా.. అని తెలుసుకోవడానికి చాలా సమయం పడుతోంది.

ప్రస్తుతం ఒమిక్రాన్ వైరస్ ను కనుగొనేందుకోసం జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని ఫలితం కోసం రోజుల తరబడి బాధితులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎం ఆర్) కేవలం నాలుగు గంటల్లోనే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఫలితాన్ని తేల్చేలా సరికొత్త ర్యాపిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఐసీఎంఆర్, టాటా ఎండీ సంయుక్త భాగస్వామ్యంలో ఈ సరికొత్త కిట్ ను రూపొందించడం జరిగింది. ఈ కిట్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లభించింది.

ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. కొద్ది రోజుల కిందటి వరకు రోజుకు 15 వేల లోపు ఉన్న కేసులు వారం రోజుల నుంచి క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 90,928 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్ కేసులు కూడా అధికంగా ఉంటున్నాయి. అయితే ఈ వేరియంట్ ను గుర్తించడంలో ఆలస్యం చోటు చేసుకుంటోంది. జీనోమ్ సీక్వెన్స్ కు చాలా సమయం పడుతోంది. ప్రస్తుతం ఐసీఎంఆర్ తీసుకొచ్చిన కిట్ తో కేవలం నాలుగు గంటల్లోనే ఫలితం రానుంది. దీంతో బాధితులు సరైన జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం కలగనుంది.

First Published:  6 Jan 2022 7:16 AM IST
Next Story