డేంజర్ జోన్ లో తెలంగాణ.. రోజు రోజుకీ రెట్టింపవుతున్న కేసులు..
తెలంగాణలో సోమవారం నమోదైన కరోనా కేసులు 482. మంగళవారం నమోదైన కేసుల సంఖ్య 1052. ఈ ఒక్క ఉదాహరణ చాలు తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి. ఒక్క రోజులోనే కేసులు రెట్టింపయ్యాయి. డిసెంబర్ లో రోజువారీ కేసుల సంఖ్య 200గా ఉంటే.. ఇప్పుడది వెయ్యి దాటిపోయింది. ఇక్కడితో ఆగుతుందా.. అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులతో పోల్చి చూస్తే, తెలంగాణలో ఆ పర్సంటేజి కాస్త ఎక్కువగానే ఉంది. 2021 […]
తెలంగాణలో సోమవారం నమోదైన కరోనా కేసులు 482. మంగళవారం నమోదైన కేసుల సంఖ్య 1052. ఈ ఒక్క ఉదాహరణ చాలు తెలంగాణలో కొవిడ్ వ్యాప్తి ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి. ఒక్క రోజులోనే కేసులు రెట్టింపయ్యాయి. డిసెంబర్ లో రోజువారీ కేసుల సంఖ్య 200గా ఉంటే.. ఇప్పుడది వెయ్యి దాటిపోయింది. ఇక్కడితో ఆగుతుందా.. అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులతో పోల్చి చూస్తే, తెలంగాణలో ఆ పర్సంటేజి కాస్త ఎక్కువగానే ఉంది. 2021 జూన్-26న చివరిసారిగా తెలంగాణలో వెయ్యికి పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ ని గుర్తు చేస్తూ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ఒక్కరోజులోనే 118 శాతం అధికం అయింది.
తెలంగాణలో ఒక్కరోజులో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1052 కాగా ఇద్దరు కొవిడ్ కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకూ తెలంగాణలో 6,84,023మందికి కొవిడ్ సోకింది, వీరిలో 4,033 మంది మృతి చెందారు. ఇటీవల కాలంలో మృతుల సంఖ్య చాన్నాళ్లపాటు సున్నాగానే ఉంది. ఇప్పుడిప్పుడే ఆందోళన పెరుగుతోంది. మంగళవారం ఇద్దరు వ్యక్తులు తెలంగాణలో కొవిడ్ కారణంగా మరణించారు.
మూడు జిల్లాల్లో విలయం..
తెలంగాణలో నమోదవుతున్న కేసుల్లో అధిక శాతం 3 జిల్లాలనుంచే ఉన్నాయి. ఒక్కరోజు నమోదైన 1052 కేసుల్లో 659 కేసులు గ్రేటర్ హైదరాబాద్ లో బయటపడగా, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా నుంచి 116 కేసులు, రంగారెడ్డి జిల్లానుంచి 109 కేసులు వచ్చాయి. ఈ మూడు ప్రాంతాల్లో కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. టెస్ట్ ల సంఖ్య కూడా భారీగా పెంచడంతో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని చెబుతున్నారు అధికారులు.
ఒమిక్రాన్ అలజడి..
తెలంగాణలో ఇప్పటి వరకు 94 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. 50 శాంపిల్స్ కి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ నుంచి రిజల్ట్ రావాల్సి ఉంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అంతర్జాతీయ ప్రయాణికుల వల్లే ఈ కేసులు పెరుగుతున్నట్టు చెబుతున్నారు అధికారులు.