Telugu Global
Cinema & Entertainment

ఫస్ట్ సింగిల్ తో వచ్చిన శేఖర్

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా […]

శేఖర్ మూవీ రివ్యూ
X

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.

“ఒరేయ్ నీ లవ్ స్టోరీ ఒకటి చెప్పురా” అనే వాయిస్ ఓవర్ తో పాట మొదలవుతుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనూప్ రూబెన్స్ ఇచ్చిన క్యాచీ ట్యాన్ కి చంద్రబోస్ గారి సాహిత్యంతో ప్రేమ కథని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాటని విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ సంయుక్తంగా ఆలపించారు.

“లవ్ గంటే మోగిందంట” అంటూ సాగే ఈ పాట యొక్క లిరికల్ వీడియోలో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది. మల్లికార్జున్ నరగని కెమెరా విజువల్స్ ఫ్రెష్ ఫీల్స్ ఇస్తున్నాయి.

సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. సంక్రాంతికి విడుదల చేస్తామంటున్నారు కానీ ఇంకా క్లారిటీ లేదు.

First Published:  5 Jan 2022 4:47 PM IST
Next Story