ఏపీలో టికెట్ రేట్లపై నాగ్ స్పందన ఇది
ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన టికెట్ రేట్లపై సినీ జనాలంతా దాదాపు ఒకే రకంగా స్పందిస్తున్నారు. తగ్గించిన టికెట్ రేట్లతో సినిమాలు రిలీజ్ చేస్తే నష్టాలు తప్పవనేది అందరి మాట. దీనికి రివర్స్ లో రియాక్ట్ అయ్యాడు నాగార్జున. ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల ప్రభావం తన సినిమాపై ఉండదంటున్నాడు. అదే బంగార్రాజు. “ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ మా సినిమాపై లేదు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. టికెట్ రేట్లు పెరిగితే ఎక్కువ డబ్బులొస్తాయి. పెరగకపోయినా నా […]
ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన టికెట్ రేట్లపై సినీ జనాలంతా దాదాపు ఒకే రకంగా స్పందిస్తున్నారు. తగ్గించిన టికెట్ రేట్లతో సినిమాలు రిలీజ్ చేస్తే నష్టాలు తప్పవనేది అందరి మాట. దీనికి రివర్స్ లో రియాక్ట్ అయ్యాడు నాగార్జున. ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల ప్రభావం తన సినిమాపై ఉండదంటున్నాడు. అదే బంగార్రాజు.
“ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ మా సినిమాపై లేదు. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. టికెట్ రేట్లు పెరిగితే ఎక్కువ డబ్బులొస్తాయి. పెరగకపోయినా నా సినిమాకొచ్చిన ఇబ్బంది లేదు. ప్రస్తుతం ఏపీలో ఉన్న టికెట్ ధరల వల్ల తక్కువ వసూళ్లు ఉంటాయి. కానీ ఈ సినిమాను అది ఇబ్బంది పెట్టదు. సినిమా వేదికపై నేను రాజకీయాలు మాట్లాడను. టికెట్ రేట్ల అంశంపై ఇంతకంటే ఎక్కువ స్పందించను.”
ఇలా టికెట్ రేట్ల అంశంపై స్పందించను అంటూనే, సూటిగా తన మనసులో మాట చెప్పేశాడు. బంగార్రాజు చిత్రంపై తక్కువ టికెట్ రేట్ల ప్రభావం ఉండదని, పెట్టిన పెట్టుబడితో పోల్చి చూస్తే, తను బ్రేక్ ఈవెన్ సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తంచేశాడు నాగ్.