Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి కానుకగా బంగార్రాజు

భీమ్లానాయక్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి సినిమాలు వాయిదా పడుతుంటే.. బంగార్రాజు మాత్రం ముందుకొచ్చాడు. తన సినిమా సంక్రాంతికొస్తుందని ప్రకటించాడు నాగార్జున. దీంతో ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వస్తున్న ఒకే ఒక్క క్రేజీ మూవీగా నిలిచింది బంగార్రాజు. “ఎప్పుడొచ్చినా సంక్రాంతికే వద్దామనుకున్నాం. అందుకు తగ్గట్టునే షూటింగ్ చేశాం. ఈ ఏడాది కుదరకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికే వచ్చేవాళ్లం. మధ్యలో వచ్చేవాళ్లం కాదు. ఎందుకంటే ఇది సంక్రాంతి సినిమా. అన్నీ కలిసొచ్చి ఈ సంక్రాంతికే సినిమా రెడీ అయింది. ప్రస్తుతం […]

సంక్రాంతి కానుకగా బంగార్రాజు
X

భీమ్లానాయక్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి సినిమాలు వాయిదా పడుతుంటే.. బంగార్రాజు మాత్రం ముందుకొచ్చాడు. తన సినిమా సంక్రాంతికొస్తుందని ప్రకటించాడు నాగార్జున. దీంతో ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వస్తున్న ఒకే ఒక్క క్రేజీ మూవీగా నిలిచింది బంగార్రాజు.

“ఎప్పుడొచ్చినా సంక్రాంతికే వద్దామనుకున్నాం. అందుకు తగ్గట్టునే షూటింగ్ చేశాం. ఈ ఏడాది కుదరకపోతే వచ్చే ఏడాది సంక్రాంతికే వచ్చేవాళ్లం. మధ్యలో వచ్చేవాళ్లం కాదు. ఎందుకంటే ఇది సంక్రాంతి సినిమా. అన్నీ కలిసొచ్చి ఈ సంక్రాంతికే సినిమా రెడీ అయింది. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి, అయినప్పటికీ పరిస్థితులు అనుకూలిస్తే మా సినిమాను జనవరి 14న థియేటర్లలోకి తీసుకురాబోతున్నాం.”

ఇలా బంగార్రాజు విడుదల తేదీని అట్టహాసంగా ప్రకటించాడు నాగార్జున. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ఫైనల్ మిక్సింగ్ జరుగుతోందని, నాగచైతన్య డబ్బింగ్ వర్క్ కూడా కాస్త పెండింగ్ ఉందని తెలిపాడు నాగ్. అందుకే ఈ ఈవెంట్ కు నాగచైతన్య రాలేకపోయాడని వివరణ ఇచ్చాడు.

మొత్తమ్మద ఈ సంక్రాంతికి అటుఇటుగా 10 సినిమాలు వస్తుంటే, అందులో బంగార్రాజు మాత్రమే బజ్ ఉన్న మూవీ అనిపించుకుంది. అయితే ఇది కూడా కచ్చితంగా వస్తుందని చెప్పలేం. బంగార్రాజు రిలీజ్ లోపే కేసుల సంఖ్య మరింత పెరిగి, లాక్ డౌన్ పెట్టడం, థియేటర్లు క్లోజ్ చేయడం లాంటివి చేస్తే మాత్రం ఈ సినిమా రాదు. ఇదే అనుమానాన్ని నాగార్జున కూడా వ్యక్తంచేశాడు. శివుడి ఆశీస్సులతో ఇంతవరకు వచ్చామని, రిలీజ్ కూడా చేస్తామని అన్నాడు.

First Published:  5 Jan 2022 4:51 PM IST
Next Story