Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి బరిలో మరో సినిమా

ఈ సంక్రాంతికి ఇప్పటికే 10 సినిమాలు షెడ్యూల్ అయిన విషయాన్ని తెలుగుగ్లోబల్ ఇప్పటికే వెల్లడించింది. లిస్ట్ లో బంగార్రాజు కూడా చేరాడు. ఇప్పుడు వీటికి పోటీగా మరో సినిమా కూడా ముస్తాబైంది. అదే సామాన్యుడు సినిమా. విశాల్ హీరోగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 14వ తేదీన థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. విశాల్ ‘సామాన్యుడు’ చిత్రంతో శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్. విశాల్ […]

సంక్రాంతి బరిలో మరో సినిమా
X

ఈ సంక్రాంతికి ఇప్పటికే 10 సినిమాలు షెడ్యూల్ అయిన విషయాన్ని తెలుగుగ్లోబల్ ఇప్పటికే వెల్లడించింది. లిస్ట్ లో బంగార్రాజు కూడా చేరాడు. ఇప్పుడు వీటికి పోటీగా మరో సినిమా కూడా ముస్తాబైంది. అదే సామాన్యుడు సినిమా. విశాల్ హీరోగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 14వ తేదీన థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

విశాల్ ‘సామాన్యుడు’ చిత్రంతో శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నాడు. డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

సినిమా టీజర్ ఇప్పటికే క్లిక్ అయింది. “ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు.. ఒకరు జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు.. ఇంకొకరుఆ సామాన్యుల్ని డబ్బు, పేరు, పదవి, అధికారం కోసం అంతం చేయాలనుకునే రాక్షసులు.. ఆ రాక్షసుల తలరాతని మార్చి రాయాల్సిన పరిస్థితి ఒక రోజు ఓ సామాన్యుడికి వస్తుంది” అనే డైలాగ్‌ టీజర్ లో హైలెట్ గా నిలిచింది.

మరికొన్ని రోజుల్లో ట్రయిలర్ రిలీజ్ చేసి, ప్రచారాన్ని అధికారికంగా స్టార్ట్ చేయబోతున్నాడు విశాల్. తమిళనాట విశాల్ సినిమాకు అజిత్ మూవీ వాళిమై నుంచి గట్టిపోటీ ఎదురుకాబోతోంది.

First Published:  4 Jan 2022 12:58 PM IST
Next Story