Telugu Global
NEWS

వ్యాక్సిన్ వేయండి.. స్కూళ్లకు తాళం వేయండి..

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాగూ సంక్రాంతికి సెలవులు ఇవ్వాలి కాబట్టి.. కాస్త ముందుగా ఈనెల 8వతేదీనుంచే ఆ సెలవులు వర్తించేలా ప్రకటన చేసింది. ఈనెల 8నుంచి 16 వరకు స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవులు ఇస్తున్నారు. టీకాల తర్వాతే సెలవులు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీనేజ్ వ్యాక్సినేషన్ మొదలైంది. తెలంగాణలో 22.78 లక్షలమందికి టీకా […]

వ్యాక్సిన్ వేయండి.. స్కూళ్లకు తాళం వేయండి..
X

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాగూ సంక్రాంతికి సెలవులు ఇవ్వాలి కాబట్టి.. కాస్త ముందుగా ఈనెల 8వతేదీనుంచే ఆ సెలవులు వర్తించేలా ప్రకటన చేసింది. ఈనెల 8నుంచి 16 వరకు స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు ముందస్తుగా సెలవులు ఇస్తున్నారు.

టీకాల తర్వాతే సెలవులు..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీనేజ్ వ్యాక్సినేషన్ మొదలైంది. తెలంగాణలో 22.78 లక్షలమందికి టీకా ఇవ్వాల్సి ఉంది. 15నుంచి 18 సంవత్సరాల వయసు లోపు ఉన్న విద్యార్థులు, ఇతరులందరికీ టీకాలు ఇవ్వడం మొదలు పెట్టారు. విద్యాసంస్థల వద్దకు వెళ్లి, కొన్ని సందర్భాల్లో స్థానిక ఆస్పత్రులకు అర్హులను రప్పించి టీకాలు ఇస్తున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థల వద్ద మెడికల్ క్యాంప్ లు నిర్వహించి టీకాలు ఇవ్వడం వైద్య సిబ్బందికి కూడా సులభమైన ప్రక్రియ. అందుకే ఈనెల 8 వరకు టీనేజ్ వ్యాక్సినేషన్ కు టార్గెట్ పెట్టారు.

ఈనెల 8 వరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని సూచించారు సీఎం కేసీఆర్. అంటే 22.78 లక్షల మందికి మొత్తం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసి, అనంతరం విద్యా సంస్థలకు సెలవులు అమలులోకి వచ్చేలా చేయాలని ఆయన ఆదేశాలిచ్చారు. వైద్యారోగ్యశాఖ అధికారులు, మంత్రి హరీష్ రావుతో ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి తదితర అంశాలపై సమీక్షించి సెలవులపై ప్రకటన చేశారు. ఈలోగా కరోనా, ఒమిక్రాన్ కేసులు మరింతగా పెరిగితే సెలవులు పొడిగించే అవకాశం ఉంటుంది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఆయా ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా తెలంగాణ ఈ నిర్ణయం తీసుకుంది. 8వ తేదీ లోగా, అంటే సెలవులు మొదలయ్యే లోగా.. టీనేజర్లందరికీ వ్యాక్సిన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.

First Published:  3 Jan 2022 9:18 PM GMT
Next Story