Telugu Global
Cinema & Entertainment

రాధేశ్యామ్ దాదాపు వాయిదా పడినట్టే!

ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడిన తర్వాత అందరి చూపు రాధేశ్యామ్ పై పడింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందని చాలామంది భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ అవ్వడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీంతో రాధేశ్యామ్ యూనిట్ వెనక్కు తగ్గింది. నిజానికి ఆర్ఆర్ఆర్ ఎప్పుడైతే వాయిదా పడిందో, ఆ వెంటనే రాధేశ్యామ్ ప్రచారం కూడా ఆపేశారు. విడుదల చేయాల్సిన సాంగ్ ను రిలీజ్ చేయలేదు. […]

రాధేశ్యామ్ దాదాపు వాయిదా పడినట్టే!
X

ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడిన తర్వాత అందరి చూపు రాధేశ్యామ్ పై పడింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా సినిమా కూడా పోస్ట్ పోన్ అవుతుందని చాలామంది భావించారు. కానీ ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ అవ్వడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. విమర్శలతో విరుచుకుపడుతున్నారు. దీంతో రాధేశ్యామ్ యూనిట్ వెనక్కు తగ్గింది.

నిజానికి ఆర్ఆర్ఆర్ ఎప్పుడైతే వాయిదా పడిందో, ఆ వెంటనే రాధేశ్యామ్ ప్రచారం కూడా ఆపేశారు. విడుదల చేయాల్సిన సాంగ్ ను రిలీజ్ చేయలేదు. నార్త్ లో ప్రభాస్ చేయాల్సిన ప్రచారం కూడా ఆపేశారు. ఉత్తరాది ఛానెల్స్ కు ఇవ్వాల్సిన ఇంటర్వ్యూలు కూడా రద్దు చేసుకున్నాడు. ఈ పరిణామాలతో రాధేశ్యామ్ వాయిదా పక్కా అనే విషయం తేలిపోయింది.

తాజా సమాచారం ప్రకారం.. 7వ తేదీన ఈ సినిమా వాయిదా పడినట్టు ప్రకటిస్తారు. అయితే తాజాగా కన్నడ వెర్షన్ కు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ లో మాత్రం రిలీజ్ డేట్ ను యథాతథంగా ఉంచారు. మరోవైపు ఈ సినిమాకు ఓవర్సీస్ సెన్సార్ పూర్తిచేయడం విశేషం. ఈ నేపథ్యంలో అనుకున్న టైమ్ కు రాధేశ్యామ్ రిలీజ్ అవుతుందా, వాయిదా పడుతుందా అనేది అనుమానాస్పదంగా మారింది.

ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణకుమార్ దర్శకుడు. ఈ సినిమాకు ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించే బాధ్యతను మాత్రం తమన్ కు అప్పగించారు.

First Published:  4 Jan 2022 1:03 PM IST
Next Story