బాలయ్య సినిమాలో కొత్త విలన్
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ఇప్పటికే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. మాస్ హీరో, మాస్ డైరెక్టర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ […]
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ఇప్పటికే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు.
మాస్ హీరో, మాస్ డైరెక్టర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అందించబోతోంది. అంతే కాదు ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర ఉంది. ఆ పాత్రను ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ చేయనున్నారు. గోపీచంద్ మలినేని తన విలన్‌లను చాలా పవర్‌ఫుల్‌గా చూపించడంలో స్పెషలిస్ట్ కాబట్టి తెలుగులో దునియా విజయ్ కు ఇది సరైన ప్రారంభం అని చెప్పచ్చు. దీంతో ఈ సినిమాలో బాలకృష్ణ, దునియా విజయ్‌ల మధ్య ఫైట్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.
బాలకృష్ణను మునుపెన్నడూ చూడని లుక్‌లో ప్రెజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు మలినేని. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రాబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్. సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు మాటలు అందిస్తున్నాడు.