Telugu Global
Cinema & Entertainment

దుమ్ముదులుపుతున్న బంగార్రాజు

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా బంగార్రాజు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజైంది. సోషల్ మీడియాలో ఈ సినిమా దుమ్ముదులుపుతుంది. ఇప్పటివరకు ఈ టీజర్ కు అత్యథికంగా 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 2 లక్షల లైకులు వచ్చాయి. అలా టాప్-2 ట్రెండింగ్ లో కొనసాగింది బంగార్రాజు టీజర్. బంగార్రాజు టీజర్ ను పెర్ ఫెక్ట్ గా కట్ చేశారు. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి షెట్టి.. ఇలా కీలక పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. […]

దుమ్ముదులుపుతున్న బంగార్రాజు
X

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా బంగార్రాజు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజైంది. సోషల్ మీడియాలో ఈ సినిమా దుమ్ముదులుపుతుంది. ఇప్పటివరకు ఈ టీజర్ కు అత్యథికంగా 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 2 లక్షల లైకులు వచ్చాయి. అలా టాప్-2 ట్రెండింగ్ లో కొనసాగింది బంగార్రాజు టీజర్.

బంగార్రాజు టీజర్ ను పెర్ ఫెక్ట్ గా కట్ చేశారు. నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి షెట్టి.. ఇలా కీలక పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. నాగ్, చైతూ స్టయిల్స్ బాగా క్లిక్ అయ్యాయి. దీంతో టీజర్ వైరల్ అయింది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని లిరికల్ వీడియోస్ రిలీజయ్యాయి. రేపోమాపో ట్రయిలర్ ను కూడా లాంఛ్ చేయబోతున్నారు. 9వ తేదీన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను సెలబ్రేట్ చేసి, 13వ తేదీన బంగార్రాజును థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. జీ స్టుడియోస్, అన్నపూర్ణ స్టుడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

First Published:  4 Jan 2022 1:01 PM IST
Next Story