పవన్ న్యాయం కోసం పోరాడతాడు : చిరంజీవి..!
తన తమ్ముడు పవన్ కళ్యాణ్ న్యాయం కోసం పోరాడతాడని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. సోమవారం చిరంజీవి మెగా అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ బ్యాంకు గురించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక విషయం పై స్పందిస్తే.. అది కరెక్ట్ అనిపిస్తుంది. తను న్యాయం కోసం పోరాడతాడు. న్యాయం కోసం మాట్లాడతాడు. అదే న్యాయం కోసం నేను కూడా పోరాడతాను. అయితే సమయం తీసుకుంటాను. మన సిన్సియారిటీ, మన నిజాయితీ, […]
తన తమ్ముడు పవన్ కళ్యాణ్ న్యాయం కోసం పోరాడతాడని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. సోమవారం చిరంజీవి మెగా అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ బ్యాంకు గురించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక విషయం పై స్పందిస్తే.. అది కరెక్ట్ అనిపిస్తుంది. తను న్యాయం కోసం పోరాడతాడు. న్యాయం కోసం మాట్లాడతాడు. అదే న్యాయం కోసం నేను కూడా పోరాడతాను. అయితే సమయం తీసుకుంటాను.
మన సిన్సియారిటీ, మన నిజాయితీ, మన సంయమనం, మన ఓపిక.. మనకు విజయాన్ని అందిస్తాయి. ఆ విషయంలో నేను ఎవరి చేత మాట అనిపించుకోలేను’ అని చిరంజీవి వ్యాఖ్యలు చేశారు.
కాగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని స్థాపించారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు మద్దతు ఇచ్చారు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కు చిరంజీవి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదనే చెప్పాలి. అయితే గత ఎన్నికలకు ముందు మాత్రం చిరంజీవి పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడ్డారు. నేరుగా తన సపోర్ట్ పవన్ కళ్యాణ్ కే అని ఆయన ప్రకటించనప్పటికీ.. పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూనే వచ్చారు.
ఎన్నికలకు ముందు నాగబాబు పలు సందర్భాల్లో అన్నయ్య చిరంజీవి మద్దతు పవన్ కళ్యాణ్ కి ఉంటుందని, కుటుంబంలోని సభ్యులుగా పవన్ వెంట ఉంటామని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి నేరుగా పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తడం గమనిస్తే ఆయన తన తమ్ముడికి నేరుగా మద్దతు ఇస్తున్నట్లు అర్థమవుతోంది.
కొద్దిరోజుల కిందట ఏపీలో టికెట్ల ధరలు తగ్గించిన సమయంలో చిరంజీవి స్పందించారు. టిక్కెట్ల ధరల పై పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైనట్లు ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చిరంజీవి నేరుగా పవన్ కళ్యాణ్ ని ప్రశంసించడం ఆసక్తికరంగా మారింది.