Telugu Global
Cinema & Entertainment

ధనుష్ తెలుగు సినిమా ప్రారంభం

ధనుష్ స్ట్రయిట్ తెలుగు సినిమా లాంఛ్ అయింది. ఈరోజు రామానాయుడు స్టుడియోస్ లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. త్రివిక్రమ్ భార్య సాయిసౌజన్య ఈ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తారు. జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ఇది. దీని పేరు సర్. తమిళంలో దీనికి వాతి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవ‌ల‌ […]

ధనుష్ తెలుగు సినిమా ప్రారంభం
X

ధనుష్ స్ట్రయిట్ తెలుగు సినిమా లాంఛ్ అయింది. ఈరోజు రామానాయుడు స్టుడియోస్ లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. త్రివిక్రమ్ భార్య సాయిసౌజన్య ఈ సినిమాకు సహ-నిర్మాతగా వ్యవహరిస్తారు.

జాతీయ అవార్డు గ్రహీత స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ఇది. దీని పేరు సర్. తమిళంలో దీనికి వాతి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవ‌ల‌ ‘రంగ్‌దే’ చిత్రానికి దర్శకత్వం వహించిన యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

సినిమా హీరోహీరోయిన్లు ధనుష్, సంయుక్త మీనన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి, ప్రముఖ నిర్మాత డా: కె.ఎల్.నారాయణ కెమెరా స్విచాన్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) స్క్రిప్ట్ అందచేశారు. ఎల్లుండి (5వ తేదీ) నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  3 Jan 2022 1:30 PM IST
Next Story