Telugu Global
NEWS

థ‌ర్డ్‌ వేవ్‌ వచ్చేసింది.. వచ్చే 2 నుంచి 4 వారాలు కీలకం

`తెలంగాణ‌లో థ‌ర్డ్ వేవ్ మొద‌లైంది. వచ్చే 2 నుంచి 4 వారాలు కీలకం. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ప్రతి ఒక్కరికీ హానికలిగే అవకాశాలు ఉన్నాయి. అందువ‌ల్ల ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాలి` అని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుత దశను రెండో ప్రమాద హెచ్చరికగా.. దేశంలో, తెలంగాణలోనూ మరోసారి కరోనా వ్యాప్తి ప్రారంభమైంద‌ని డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు చెప్పారు. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు రోజుకు 10 వేల కేసులొచ్చాయని, […]

థ‌ర్డ్‌ వేవ్‌ వచ్చేసింది.. వచ్చే 2 నుంచి 4 వారాలు కీలకం
X

'తెలంగాణ‌లో థ‌ర్డ్ వేవ్ మొద‌లైంది. వచ్చే 2 నుంచి 4 వారాలు కీలకం. ఒమిక్రాన్‌ వేరియంట్‌తో ప్రతి ఒక్కరికీ హానికలిగే అవకాశాలు ఉన్నాయి. అందువ‌ల్ల ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాలి' అని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ప్రస్తుత దశను రెండో ప్రమాద హెచ్చరికగా.. దేశంలో, తెలంగాణలోనూ మరోసారి కరోనా వ్యాప్తి ప్రారంభమైంద‌ని డాక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు చెప్పారు. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు రోజుకు 10 వేల కేసులొచ్చాయని, ఇప్పుడు కొద్దికాలంలోనే రోజుకు 30 వేల కేసులు కూడా రికార్డయ్యే అవకాశాలున్నాయని హెచ్చ‌రించారు. అంతే స్థాయిలో వైరస్‌ తీవ్రత తగ్గిపోయి కేసులు సాధారణ స్థాయికి చేరుకుంటాయన్నారు.

వైరస్‌ కంటే దాని వల్ల క‌లిగే భయం ప్ర‌జ‌ల‌ను బాధిస్తుంద‌ని, ప్రాణాలు పోయేందుకు కారణం అవుతుంద‌న్నారు. 10 శాతం మందిలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించినా.. స్వల్ప సంఖ్యలోనే సీరియస్‌ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సరఫరా చేసే కిట్‌లతో నయం చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా 62 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం పాజిటివిటీ రేట్‌ 0.6 శాతం ఉంద‌న్నారు.

కేసులు పెరిగినా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, క‌రోనా ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లో నేర్చుకున్న పాఠాలతో తెలంగాణ ప్రభుత్వం, వైద్యశాఖ పూర్తిస్థాయిలో వైర‌స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంద‌న్నారు. ఆస్ప‌త్రుల్లో పడకలు, ఆక్సిజన్, మెడిసిన్ అందుబాటులో ఉన్నాయ‌ని చెప్పారాయ‌న‌. న్యూఇయర్, సంక్రాంతి నేపథ్యంలో కోవిడ్‌ తీవ్రత పెరిగే అవకాశాలున్నాయ‌ని, కాబ‌ట్టి కుటుంబ సభ్యుల మధ్యే వేడుకలు జరుపుకుంటే మంచిద‌ని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలకు, పబ్బులు, పార్టీలకు వెళ్లే వారు త‌గిన జాగ్రత్తలు పాటించాల‌ని కోరారు.

First Published:  31 Dec 2021 5:48 AM IST
Next Story