బాలీవుడ్ రీఎంట్రీపై చరణ్ స్పందన
టాలీవుడ్ లో ఇప్పటి జనరేషన్ హీరోల్లో అందరికంటే ముందు బాలీవుడ్ కు వెళ్లిన హీరో రామ్ చరణ్. చాలామందికి ఆ ఆలోచన కూడా రాకముందే, చరణ్ బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. జంజీర్ అనే క్లాసిక్ సినిమాను రీమేక్ చేశాడు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో బాలీవుడ్ వైపు మళ్లీ కన్నెత్తి చూడలేదు ఈ మెగా హీరో. మళ్లీ ఇన్నాళ్లకు బాలీవుడ్ కెరీర్ పై చరణ్ కు ప్రశ్న ఎదురైంది. మళ్లీ హిందీలో ఎప్పుడు స్ట్రయిట్ […]
టాలీవుడ్ లో ఇప్పటి జనరేషన్ హీరోల్లో అందరికంటే ముందు బాలీవుడ్ కు వెళ్లిన హీరో రామ్ చరణ్. చాలామందికి ఆ ఆలోచన కూడా రాకముందే, చరణ్ బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. జంజీర్ అనే క్లాసిక్ సినిమాను రీమేక్ చేశాడు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో బాలీవుడ్ వైపు మళ్లీ కన్నెత్తి చూడలేదు ఈ మెగా హీరో.
మళ్లీ ఇన్నాళ్లకు బాలీవుడ్ కెరీర్ పై చరణ్ కు ప్రశ్న ఎదురైంది. మళ్లీ హిందీలో ఎప్పుడు స్ట్రయిట్ సినిమా చేస్తారంటూ మీడియా చరణ్ ను ప్రశ్నించింది. దీనిపై చరణ్ పరోక్షంగా స్పందించాడు. ఇకపై బాలీవుడ్ లో తన నుంచి స్ట్రయిట్ మూవీ రాదనే అర్థం వచ్చేలా స్పందించాడు చరణ్.
బాలీవుడ్ దర్శకులు ఎవ్వర్నీ తను సినిమా చేద్దామని అడగనంటున్నాడు చరణ్. తను అడిగితే ప్రాజెక్టు సక్సెస్ కాదని, ఆ ప్రాజెక్టుకు తను అవసరమని దర్శకుడు భావించినప్పుడే సినిమా హిట్టవుతుందని అభిప్రాయపడ్డాడు. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ తర్వాత ఆ పరిస్థితి వస్తుందని అంటున్నాడు చరణ్.
అతడు నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న థియేటర్లలోకి వస్తోంది. రాజమౌళి ఈ సినిమాకు దర్శకుడు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి.