తగ్గిన ప్రయాణాలు.. 5 రోజుల్లో 12 వేల విమాన సర్వీసులు రద్దు..
భారత్ లో ప్రయాణాలు నాలుగో వంతు తగ్గిపోయాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండటంతో చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బస్సుల్లో 50శాతం మంది ప్రయాణికులకే అనుమతి అంటూ ఢిల్లీ ఇప్పటికే కండిషన్ పెట్టింది. స్థానికంగా మెట్రో రైళ్లలో కూడా ఇదే నిబంధన అమలులో ఉంది. దీంతో ఢిల్లీలో సగానికిపైగా ప్రయాణాలు తగ్గిపోయాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా నిబంధనలు క్రమక్రమంగా పెరిగిపోవడంతో చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. […]
భారత్ లో ప్రయాణాలు నాలుగో వంతు తగ్గిపోయాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉండటంతో చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బస్సుల్లో 50శాతం మంది ప్రయాణికులకే అనుమతి అంటూ ఢిల్లీ ఇప్పటికే కండిషన్ పెట్టింది. స్థానికంగా మెట్రో రైళ్లలో కూడా ఇదే నిబంధన అమలులో ఉంది. దీంతో ఢిల్లీలో సగానికిపైగా ప్రయాణాలు తగ్గిపోయాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా నిబంధనలు క్రమక్రమంగా పెరిగిపోవడంతో చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
భారీగా రద్దయిన విమాన సర్వీసులు..
భారత్ లో ఒమిక్రాన్ కేసుల ప్రభావం విమాన సర్వీసులపై భారీగా కనపడుతోంది. ఇప్పటికే చాలా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. పొరుగు దేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసుకుంటున్నాయి. ఒమిక్రాన్ రిస్క్ ఉన్న దేశాల్లో విమాన సర్వీసులు నడుస్తున్నా ఆర్టీపీసీఆర్ రిపోర్టులు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, క్వారంటైన్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీంతో విమాన ప్రయాణం అంటేనే భయపడిపోతున్నారు ప్రజలు. భారత్ లో గత ఐదు రోజుల వ్యవధిలో 12వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి.
న్యూ ఇయర్ సందడి లేదు..
ప్రతి ఏడాది డిసెంబర్ చివరి వారంలో విమాన సర్వీసులకు భారీగా డిమాండ్ ఉండేది. గతేడాది కరోనా వల్ల పూర్తిగా డిమాండ్ పడిపోయింది. ఈ ఏడాది అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఒమిక్రాన్ కారణంగా సర్వీసులు రద్దవుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశీయ సర్వీసులతో పాటు అంతర్జాతీయ సర్వీసులు కూడా రద్దవుతుండటంతో విమానయాన రంగం మరోసారి కష్టాల్లో పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఢిల్లీ బాటలో బెంగాల్..
ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో ఒక్కో రాష్ట్రం మెల్ల మెల్లగా ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతోంది. ముందుగా ఢిల్లీలో స్కూళ్లు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ లో స్కూళ్లకు సెలవలు ప్రకటించారు. అటు మహారాష్ట్రలో కూడా ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లు పెడుతూ ఆంక్షలు విధిస్తున్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు అధికారులు.