రాజకీయ లబ్ధి కోసమే సినిమా టిక్కెట్ రేట్లపై ఆరోపణలు : రోజా
ఏపీలో కొద్ది రోజుల కిందట సినిమా టికెట్ల ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని కూడా ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. అయితే సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విమర్శలు వస్తున్నాయి. సినిమా టికెట్ల ధరల పై పునరాలోచించాలని పలువురు సినీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ కు విన్నవించారు. హీరోలు నాని, నిఖిల్, కార్తికేయ, సిద్ధార్థ్ వంటి వారు నేరుగా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. అయితే సామాన్యులు […]
ఏపీలో కొద్ది రోజుల కిందట సినిమా టికెట్ల ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని కూడా ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. అయితే సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి విమర్శలు వస్తున్నాయి. సినిమా టికెట్ల ధరల పై పునరాలోచించాలని పలువురు సినీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ కు విన్నవించారు. హీరోలు నాని, నిఖిల్, కార్తికేయ, సిద్ధార్థ్ వంటి వారు నేరుగా ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. అయితే సామాన్యులు కూడా సినిమా థియేటర్ కు వెళ్లేందుకే టిక్కెట్ ధరలను తగ్గించినట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఈ విషయమై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. కొందరు రాజకీయ లబ్ధి కోసమే సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. పేద ప్రజల కోసమే ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించిందని చెప్పారు.
టికెట్ రేట్లు ఫిక్స్ డ్ గా ఉంటే పేద, మధ్యతరగతి వారికి సులువుగా సినిమా చూసే అవకాశం ఉంటుందని అన్నారు. జగన్ వంటి ఫ్రెండ్లీ నేచర్ ఉన్న ముఖ్యమంత్రి ఎవరూ ఉండరన్నారు. చిరంజీవి, నాగార్జున ఇతర సినీ పెద్దలు కోరడం వల్లే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని వివరించారు.
సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై ప్రభుత్వం సినీ ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకుంటోందని, త్వరలోనే టికెట్ రేట్ల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా సినిమా టికెట్ల ధరల పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.