బూస్టర్ కే బూస్టర్.. ఇజ్రాయెల్ లో నాలుగో డోస్..
ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఫస్ట్ డోస్ కొవిడ్ టీకా కూడా సక్రమంగా పంపిణీ చేయలేని పేద దేశాలు చాలానే ఉన్నాయి. వ్యాక్సిన్ కోసం నిధులు లేక, ఆర్థిక వనరులు అంతంతమాత్రంగానే ఉండటంతో.. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇంకా టీకా ప్రక్రియ జోరందుకోలేదు. ఈ క్రమంలో బూస్టర్ డోస్ పై ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ధనిక దేశాలకు పలు సూచనలు చేసింది. అప్పుడే బూస్టర్ కి తొందరపడొద్దని పేద దేశాలకు సింగిల్ డోస్ కూడా అందలేదని ఆవేదన […]
ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఫస్ట్ డోస్ కొవిడ్ టీకా కూడా సక్రమంగా పంపిణీ చేయలేని పేద దేశాలు చాలానే ఉన్నాయి. వ్యాక్సిన్ కోసం నిధులు లేక, ఆర్థిక వనరులు అంతంతమాత్రంగానే ఉండటంతో.. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో ఇంకా టీకా ప్రక్రియ జోరందుకోలేదు. ఈ క్రమంలో బూస్టర్ డోస్ పై ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ధనిక దేశాలకు పలు సూచనలు చేసింది. అప్పుడే బూస్టర్ కి తొందరపడొద్దని పేద దేశాలకు సింగిల్ డోస్ కూడా అందలేదని ఆవేదన వెలిబుచ్చింది. కానీ ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో బూస్టర్ కోసం అన్ని దేశాలు సిద్ధమయ్యాయి. కొన్ని దేశాల్లో ఆల్రడీ థర్డ్ డోస్ వ్యాక్సిన్ పంపిణీ దాదాపుగా పూర్తి కావచ్చింది. భారత్ లో జనవరి 3 నుంచి ప్రికాషనరీ డోస్ పేరుతో మూడో డోస్ కొవిడ్ టీకా ఇవ్వబోతున్నారు. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయంలో చాలా ముందుంది. అమెరికాని కూడా తలదన్నింది. అప్పుడే నాలుగో డోస్ ట్రైల్స్ చేపట్టింది.
ఇజ్రాయెల్ లో ఇప్పటికే మూడు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. దేశ జనాభాలో దాదాపు 63 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. 45 శాతం మంది మూడో డోస్ కూడా వేయించుకున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో నాలుగో డోస్ కి సన్నాహాలు చేసింది ఇజ్రాయెల్. అక్కడ వెయ్యికి పైగా ఒమిక్రాన్ కేసులున్నాయి. అయితే ముందుగా వాలంటీర్లకు నాలుగో డోస్ టీకా ఇచ్చి.. ఆ డోస్ తీసుకున్న తర్వాత రోగనిరోధక శక్తి స్థాయిలను అంచనా వేసి ఆ తర్వాత ప్రజలకు వేయాలని నిర్ణయించారు అధికారులు.
6వేల మంది వాలంటీర్లకు నాలుగో డోస్ టీకా ఇవ్వబోతున్నారు. వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ కి ఆల్రడీ మొదలు పెట్టారు. వీరిలో రోగ నిరోధక శక్తి ఏమేరకు పెరిగిందో అంచనా వేసి ఆ తర్వాత ప్రజలందరికీ నాలుగో డోసు సిఫార్సు చేయబోతున్నారు. ప్రపంచంలోనే నాలుగో డోస్ వేసిన మొదటి దేశంగా ఇజ్రాయెల్ రికార్డులు సృష్టించింది. నాలుగో డోస్ తో కలిగే అదనపు ప్రయోజనాలు, ఎవరికి అవసరం? డోస్ ల మధ్య తక్కువ వ్యవధి ఉండటం సురక్షితమేనా? తదితర విషయాలు తెలుసుకునేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు అధికారులు.