లైగర్ నుంచి వరుసగా అప్ డేట్స్
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లైగర్ లో డైనమేట్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీదకు పరిచయం కాబోతోన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక చివరి షెడ్యూల్‌ను ఇండియాలో షూట్ చేయబోతోన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందో డీటెయిల్డ్ గా బయటపెట్టారు మేకర్స్. డిసెంబర్ 31న ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 29న ఉదయం 10:03 […]
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లైగర్ లో డైనమేట్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీదకు పరిచయం కాబోతోన్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక చివరి షెడ్యూల్‌ను ఇండియాలో షూట్ చేయబోతోన్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఏ అప్ డేట్ వస్తుందో డీటెయిల్డ్ గా బయటపెట్టారు మేకర్స్. డిసెంబర్ 31న ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 29న ఉదయం 10:03 గంటలకు ది బిగ్ అనౌన్స్మెంట్ వీడియోను రిలీజ్ చేయబోతోన్నారు.
డిసెంబర్ 30న రెండు స్పెషల్ ట్రీట్‌లు ఉండబోతోన్నాయి. సినిమాకు సంబంధించిన స్పెషల్ స్టిల్స్‌ను ఉదయం 10:03 గంటలకు విడుదల చేస్తుండగా.. ఇనస్టాగ్రామ్ ఫిల్టర్‌ను సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ఈ ఏడాది చివర్లో మాత్రం ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు.
ఇండియాలోనే అత్యంత భారీగా నిర్మిస్తున్న యాక్షన్ చిత్రంగా లైగర్ నిలవబోతోంది. మార్షల్ ఆర్ట్స్‌తో నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో లెజెండ్ మైక్ టైసన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఊపిరి బిగపట్టుకునేలా ఉండనున్నాయి.
ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందిస్తున్నారు. సినిమా ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది.