Telugu Global
NEWS

కక్ష సాధింపు అంటారేంటి..? లైసెన్స్ లేని థియేటర్లే మూతబడ్డాయి " పేర్ని నాని

ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు, సినిమా హాళ్లలో జరుగుతున్న తనిఖీలు, థియేటర్ల స్వచ్ఛంద మూసివేత.. తదనంతర పరిణామాలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. అమరావతి సచివాలయంలో సినిమా డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం అనంతరం నాని మీడియాతో మాట్లాడారు. టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం కమిటీని నియమించిందని థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరలను ఆ కమిటీ నిర్ధారిస్తుందని చెప్పారు. కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని అన్నారు. అనుమతుల్లేనివాటిపైనే చర్యలు.. సినిమా ప్రదర్శనకు రెవెన్యూ శాఖ నుంచి […]

కక్ష సాధింపు అంటారేంటి..? లైసెన్స్ లేని థియేటర్లే మూతబడ్డాయి  పేర్ని నాని
X

ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు, సినిమా హాళ్లలో జరుగుతున్న తనిఖీలు, థియేటర్ల స్వచ్ఛంద మూసివేత.. తదనంతర పరిణామాలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. అమరావతి సచివాలయంలో సినిమా డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం అనంతరం నాని మీడియాతో మాట్లాడారు. టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం కమిటీని నియమించిందని థియేటర్ల వర్గీకరణ, టికెట్ ధరలను ఆ కమిటీ నిర్ధారిస్తుందని చెప్పారు. కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని అన్నారు.

అనుమతుల్లేనివాటిపైనే చర్యలు..
సినిమా ప్రదర్శనకు రెవెన్యూ శాఖ నుంచి బి-ఫాం, అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు మంత్రి నాని. చాలామంది లైసెన్స్ లు రెన్యువల్ చేసుకోలేదని, కనీసం కొత్త లైసెన్స్ లకు దరఖాస్తులు కూడా చేయలేదని చెప్పారు. అలాంటి వారిపైనే చర్యలకు సిద్ధమైనట్టు వివరించారు. ఏపీలో ఇప్పటివరకూ నిబంధనలు అతిక్రమించిన 130 సినిమా హాళ్లపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు మంత్రి నాని. లైసెన్స్ లేని వాళ్లు 22మంది థియేట‌ర్ల‌ను మూసేసుకున్నార‌ని, 83 థియేటర్లను తామే సీజ్ చేశామన్నారు. 25 థియేటర్లకు జరిమానా విధించినట్టు వివరించారు. జీవో-35.. ఏప్రిల్‌ 2021లో వచ్చింది. దానికి నిరసనగా ఇప్పుడు థియేటర్లు మూసివేయడం హాస్యాస్పదం అని అన్నారు మంత్రి పేర్ని నాని.

చంద్రబాబు సొంత బామ్మ‌ర్ది, క‌మ్ వియ్యంకుడు తీసిన సినిమాకు ఆయన హయాంలో రాయితీ ఇచ్చార‌ని, అదే చిరంజీవి తీసిన సినిమాకు రాయితీ ఇవ్వ‌లేద‌ని గుర్తు చేశారు మంత్రి పేర్ని నాని. త‌మ‌కు అలాంటి త‌రతమ బేధాలు లేవని చెప్పారు. చిరంజీవి, దిల్ రాజు ఏపీ ప్రభుత్వాన్ని కలవడానికి ఆసక్తిగా ఉన్నట్టు వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు. దానిపై తమకు సమాచారం లేదన్నారు. ఇక సినిమా థియేటర్ల కౌంటర్ ని కిరాణా కొట్టు కౌంటర్ తో పోల్చిన హీరో నానిపై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు మంత్రి నాని. ఆయన ఎక్కడ ఉంటారో తనకు తెలియదని, ఏ హాలుని ఏ కిరాణా కొట్టుతో పోల్చి లెక్కలు చెప్పారో కూడా తనకు తెలియదన్నారు. చెన్నైలో ఉండే నటుడు సిద్ధార్థ్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి ఉంటారని సెటైర్లు వేశారు. తమిళనాడు నటుడికి ఏపీ టికెట్లతో సంబంధం ఏంటని, ఆయన ఇక్కడేమైనా పన్నులు చెల్లిస్తున్నారా అని ప్రశ్నించారు.

మొత్తమ్మీద ఏపీ థియేటర్లపై జరుగుతున్న దాడుల్ని కక్షపూరితం అంటూ కొందరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, టికెట్ల రేట్ల తగ్గింపుకి వ్యతిరేకంగా ఎక్కడా థియేటర్లు మూతబడటం లేదని, లొసుగులు ఉన్నచోటే యాజమాన్యాలు స్వచ్ఛందంగా తాళాలు వేసుకుంటున్నాయని వివరించారు. టికెట్ రేట్ల వ్యవహారంపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి పేర్ని నాని.

First Published:  28 Dec 2021 7:00 AM GMT
Next Story