Telugu Global
NEWS

వారి ఆత్మాభిమానం దెబ్బతినకూడదనే.. " సీఎం జ‌గ‌న్‌

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో పెన్ష‌న్ల కోసం వృద్ధులు, విక‌లాంగులు వారి ఆత్మాభిమానం చంపుకొని కాళ్లు అరిగేలా జన్మభూమి కమిటీల చుట్టు తిరిగే ప‌రిస్థితి ఉండేది. ఈరోజున సంక్షేమ ప‌థ‌కాలే పేద‌ల‌ను వెతుక్కుంటూ వ‌స్తున్నాయ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు. అర్హ‌త ఒక్క‌టే ఆధారంగా సంక్షేమ పథకాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారాయ‌న‌. రాష్ట్రంలో 61,74,593 పెన్షన్ కార్డులు, 1 కోటీ 40 ల‌క్ష‌ల 45 వేల 491 ఆరోగ్య‌శ్రీ కార్డుదారులు ఉన్నార‌ని వివ‌రించారు. దేశ చరిత్రలో […]

వారి ఆత్మాభిమానం దెబ్బతినకూడదనే..  సీఎం జ‌గ‌న్‌
X

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో పెన్ష‌న్ల కోసం వృద్ధులు, విక‌లాంగులు వారి ఆత్మాభిమానం చంపుకొని కాళ్లు అరిగేలా జన్మభూమి కమిటీల చుట్టు తిరిగే ప‌రిస్థితి ఉండేది. ఈరోజున సంక్షేమ ప‌థ‌కాలే పేద‌ల‌ను వెతుక్కుంటూ వ‌స్తున్నాయ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు. అర్హ‌త ఒక్క‌టే ఆధారంగా సంక్షేమ పథకాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారాయ‌న‌. రాష్ట్రంలో 61,74,593 పెన్షన్ కార్డులు, 1 కోటీ 40 ల‌క్ష‌ల 45 వేల 491 ఆరోగ్య‌శ్రీ కార్డుదారులు ఉన్నార‌ని వివ‌రించారు.

దేశ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా అర్హత ఉండీ సంక్షేమ ప‌థ‌కాలు అంద‌ని వారికి మరో అవకాశం ఇచ్చామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. అర్హులై ఉండి కూడా దరఖాస్తు చేసుకోని వారికి, నిర్దారణలో పొరపాటు, బ్యాంకు అకౌంట్లలో మిస్టేక్స్.. అనేక కారణాలతో పథకాలు అందనివారికి సంక్షేమ సాయం అందాలని ఈకార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి మిగిలిపోయిన 9,30,809 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.703 కోట్లను జగన్ జ‌మ చేశారు.

చంద్ర‌బాబు హయాంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువుల పెన్ష‌న్ల కోసం నెల‌కు 400 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేసేవార‌ని, వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వ‌చ్చాక సామాజిక పింఛ‌న్ల కోసం రూ.1450 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నామ‌న్నారు. టీడీపీ కేవ‌లం 39 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే పెన్ష‌న్లు ఇస్తే.. త‌మ ప్ర‌భుత్వం 61 ల‌క్ష‌ల మందికి పెన్ష‌న్లు ఇస్తుంద‌న్నారు.

ఎవ‌రి ఆత్మాభిమానం దెబ్బతినకూడదని వ‌లంటీర్ల ద్వారా పింఛ‌న్లు పంపిణీ చేప‌ట్టామ‌న్నారు. వ‌చ్చ ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి పింఛ‌న్లు రూ.2250 నుంచి 2500 రూపాయ‌ల‌కు పెంచుతున్నామ‌ని చెప్పారు. వివక్ష, లంచాలకు చోటులేకుండా అర్హులంద‌రికీ ప‌థ‌కాలు అందిస్తున్నామ‌న్నారు.

కోవిడ్‌ సమయంలో ప్రభుత్వ రాబడి తగ్గినప్పటికీ, ప్రభుత్వ ఖర్చు పెరిగినప్పటికీ, పేదలకు అండ‌గా నిలిచామ‌ని, మాన‌వ‌త్వంతో ముంద‌డుగు వేశామ‌ని సీఎం జ‌గ‌న్ వివ‌రించారు. 31 నెలల పాలన తర్వాత కూడా మరో 9,30,809 మంది లబ్ధిదారులకు మేలు చేస్తూ రూ.703 కోట్లు అందిస్తున్నామ‌న్నారు. ప్ర‌తి ఏటా జూన్‌, డిసెంబ‌ర్‌లో ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

First Published:  28 Dec 2021 10:05 AM IST
Next Story