Telugu Global
International

మీ జెండర్ మీ ఇష్టం.. స్విట్జర్లాండ్ లో కొత్త రూల్..

16ఏళ్లు వచ్చిన తర్వాత తాను అబ్బాయినా, అమ్మాయినా అని నిర్ణయించుకునే స్వేచ్ఛ స్విట్జర్లాండ్ పౌరులకు కొత్త ఏడాది కానుకగా అందబోతోంది. ఈమేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి-1 నుంచి స్విస్ పౌరులెవరైనా సరే.. తాము ఆడ కాదు, మగ అంటే.. అలాగే ప్రభుత్వం సర్టిఫికెట్ ఇస్తుంది, వారి పేరు మార్చేస్తుంది. మేము మగ కాదు ఆడ అంటూ ఎవరైనా సివిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లకు వెళ్లి అర్జీ ఇస్తే వెంటనే ఆడవారిగా పేరు మార్చి […]

మీ జెండర్ మీ ఇష్టం.. స్విట్జర్లాండ్ లో కొత్త రూల్..
X

16ఏళ్లు వచ్చిన తర్వాత తాను అబ్బాయినా, అమ్మాయినా అని నిర్ణయించుకునే స్వేచ్ఛ స్విట్జర్లాండ్ పౌరులకు కొత్త ఏడాది కానుకగా అందబోతోంది. ఈమేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి-1 నుంచి స్విస్ పౌరులెవరైనా సరే.. తాము ఆడ కాదు, మగ అంటే.. అలాగే ప్రభుత్వం సర్టిఫికెట్ ఇస్తుంది, వారి పేరు మార్చేస్తుంది. మేము మగ కాదు ఆడ అంటూ ఎవరైనా సివిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లకు వెళ్లి అర్జీ ఇస్తే వెంటనే ఆడవారిగా పేరు మార్చి వారికి సర్టిఫికెట్ ఇస్తారు. జెండర్ సెల్ఫ్ డిక్లరేషన్ మూమెంట్ లో భాగంగా స్విట్జర్లాండ్ ఈ మార్పుకి శ్రీకారం చుట్టింది.

వాస్తవానికి ఆడ, మగ లేదా ట్రాన్స్ జెండర్ లక్షణాలున్నవారు యుక్తవయసు వచ్చిన తర్వాత కొత్తగా తమ జెండర్ మార్చుకోవాలంటే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వైద్యులు ధృవీకరించకపోతే, ఆపరేషన్ చేయించుకుని ఆ తర్వాత అధికారికంగా తమ జెండర్ మార్చేసుకోవచ్చు. కానీ స్విట్జర్లాండ్ లో మాత్రం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు. జనవరి-1 నుంచి నేను ఆడ అంటే ఆడ, మగ అంటే మగ. అదీ అక్కడ పాలసీ. 16ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్న పిల్లలు ఇలా తమ జెండర్ మార్చుకోవాలంటే మాత్రం వారి సంరక్షకుల అనుమతి తప్పనిసరి.

ఐర్లాండ్, బెల్జియం, పోర్చుగల్, నార్వే లాంటి దేశాల్లో జెండర్ సెల్ఫ్ డిక్లరేషన్ అమలులో ఉంది. ఇప్పుడు దీన్ని స్విట్జర్లాండ్ కూడా కొత్త ఏడాది సరికొత్త నిర్ణయంగా ప్రకటిస్తోంది. ఆమధ్య దత్తత నియమాలను కూడా స్విట్జర్లాండ్ సవరించింది. కలసి కాపురం చేస్తున్న ఇద్దరు పురుషులు, లేదా ఇద్దరు స్త్రీలు.. పిల్లల్ని దత్తత తీసుకోవడం స్విట్జర్లాండ్ లో కుదిరేపని కాదు. కొత్త చట్టం తీసుకొచ్చాక వారికి దత్తత తీసుకునే అవకాశం లభించింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి జెండర్ సెల్ఫ్ డిక్లరేషన్ ని కూడా స్విట్జర్లాండ్ అంగీకరించింది.

First Published:  27 Dec 2021 4:52 AM IST
Next Story