Telugu Global
National

ఈ కొత్త వర్క్ మోడల్స్ గురించి తెలుసా?

ప్యాండెమిక్ వల్ల కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌నే అనుసరిస్తున్నాయి. అయితే ఎక్కువ కాలంపాటు ‘వర్క్ ఫ్రం హోం’ వల్ల కొన్ని సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతం కొత్త వర్కింగ్ మోడల్స్ వైపు చూస్తున్నాయి. ఈ కొత్త మోడల్స్ ఎలా ఉంటాయంటే.. సహోద్యోగులతో చర్చలు జరపలేకపోవడం, ఉద్యోగుల్లో ఆందోళన, నిరాశ పెరగడం వంటివి వర్క్ ఫ్రం హోంలో లోపాలుగా ఉంటున్నాయి. అందుకే వీటికి పరిష్కారంగా కంపెనీలు కొత్త హైబ్రిడ్ వర్క్ మోడల్స్‌ను అనుసరిస్తున్నాయి. ఈ హైబ్రిడ్​ వర్క్ మోడల్స్‌తో.. […]

ఈ కొత్త వర్క్ మోడల్స్ గురించి తెలుసా?
X

ప్యాండెమిక్ వల్ల కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్‌నే అనుసరిస్తున్నాయి. అయితే ఎక్కువ కాలంపాటు ‘వర్క్ ఫ్రం హోం’ వల్ల కొన్ని సమస్యలు తలెత్తడంతో ప్రస్తుతం కొత్త వర్కింగ్ మోడల్స్ వైపు చూస్తున్నాయి. ఈ కొత్త మోడల్స్ ఎలా ఉంటాయంటే..

సహోద్యోగులతో చర్చలు జరపలేకపోవడం, ఉద్యోగుల్లో ఆందోళన, నిరాశ పెరగడం వంటివి వర్క్ ఫ్రం హోంలో లోపాలుగా ఉంటున్నాయి. అందుకే వీటికి పరిష్కారంగా కంపెనీలు కొత్త హైబ్రిడ్ వర్క్ మోడల్స్‌ను అనుసరిస్తున్నాయి. ఈ హైబ్రిడ్​ వర్క్ మోడల్స్‌తో.. ఉద్యోగులు వర్క్​ ఫ్రం హోం చేస్తూనే.. ఆన్​సైట్​లో, ఆఫీసుల్లో పని చేసే వీలుంటుంది.

హైబ్రిడ్ వర్క్‌ప్లేసెస్
ప్యాండెమిక్ తర్వాత ట్రెడిషనల్ ఆఫీసులు పోయి కొత్తగా శాటిలైట్, డీసెంట్రలైజ్డ్, ఫ్లెక్సిబుల్ వర్క్‌ ప్లేసెస్ పుట్టుకొచ్చాయి. వీటినే ‘హైబ్రిడ్ వర్క్‌ప్లేస్’ అంటున్నారు. ఇందులో కొన్ని రకాలున్నాయి. అవేంటంటే..

వర్క్ నియర్ హోమ్
ఉద్యోగులు తమ ఇంటికి దగ్గరగా ఉన్న ప్రదేశాల నుంచి పని చేసే పద్ధతిని వర్క్ నియర్ హోమ్ అంటున్నారు. మెట్రో, నాన్-మెట్రో సిటీల్లోని కొన్ని చోట్ల కంపెనీలు మల్టిపుల్ శాటిలైట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఉద్యోగులు కావాలనుకుంటే ఆ ఆఫీసుల నుంచి పనిచేయొచ్చు. ఇదే వర్క్ నియర్ హోమ్

ఎంప్లాయ్ డ్రివెన్ వర్క్‌ప్లేస్
వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పాజిటివ్‌గా ఉండేందుకు కంపెనీలు ఈ తరహా మోడల్‌ను తీసుకొస్తున్నాయి. ఈ మోడల్‌లో ఉద్యోగులు తమకు నచ్చిన ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్‌లో పనిచేసుకోవచ్చు. అలాగే పనికోసం కేటాయించిన డైనమిక్ వర్క్ స్టేషన్లలో కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి. కెఫె, రిలాక్స్ రూమ్స్, వెల్ నెస్ రూమ్స్, బెడ్స్, కాన్ఫరెన్స్ రూమ్స్ లాంటి ఏర్పాట్లు ఉంటాయి.

ప్రస్తుతం ఈ కొత్త వర్క్‌ మోడల్స్‌ను పోర్చుగల్‌ దేశం అమలు చేస్తోంది. పలుదేశాల్లో సక్సెస్ అయిన తర్వాత మనదేశంలో కూడా ఇలాంటి మోడల్స్‌ను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఇండోర్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, జైపూర్, కొచ్చి, లక్నో వంటి నాన్-మెట్రో సిటీల్లో హైబ్రిడ్ స్టేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మోడల్స్ సక్సెస్ అయితే ఫ్యూచర్లో అన్ని కంపెనీలు ఇదే బాట పట్టే అవకాశం ఉంది.

First Published:  27 Dec 2021 9:18 AM IST
Next Story