Telugu Global
Cinema & Entertainment

గని మూవీ.. మరో రిలీజ్ డేట్

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `గ‌ని`. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడీ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. మార్చి 18న గని సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. గని అనే సరికొత్త పాత్రలో […]

గని మూవీ.. మరో రిలీజ్ డేట్
X

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం 'గ‌ని'. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడీ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. మార్చి 18న గని సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

గని అనే సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్, సినిమా ప్రోమో, సాంగ్‌లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను భారీ ఎత్తులో నిర్మించామంటున్నారు మేకర్స్.

బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

నిజానికి ఈ సినిమా ఈపాటికే థియేటర్లలోకి రావాల్సింది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే 3 రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేశారు. ఇప్పుడు కొత్తగా మార్చి 18 తేదీని ఫిక్స్ చేశారు.

First Published:  27 Dec 2021 11:43 AM IST
Next Story