సుకుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ
ప్రస్తుతం పుష్ప సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సుకుమార్. త్వరలోనే పుష్ప-2 సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ ప్రకటించారు. సుకుమార్ తో సినిమా చేయాలని ఉందనే కోరికను బయటపెట్టారు బాలకృష్ణ. మంచి క్యారెక్టర్ ఉంటే సుక్కూ దర్శకత్వంలో సినిమా చేస్తానన్నారు. అది కూడా సుక్కూ స్టయిల్ లో ఏడాది కాకుండా 3-4 నెలల్లోనే పూర్తి చేస్తానన్నారు. ఇంకా చెప్పాలంటే దసరాకు […]
ప్రస్తుతం పుష్ప సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సుకుమార్. త్వరలోనే పుష్ప-2 సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ ప్రకటించారు.
సుకుమార్ తో సినిమా చేయాలని ఉందనే కోరికను బయటపెట్టారు బాలకృష్ణ. మంచి క్యారెక్టర్ ఉంటే సుక్కూ దర్శకత్వంలో సినిమా చేస్తానన్నారు. అది కూడా సుక్కూ స్టయిల్ లో ఏడాది కాకుండా 3-4 నెలల్లోనే పూర్తి చేస్తానన్నారు. ఇంకా చెప్పాలంటే దసరాకు కొబ్బరికాయ కొట్టి, క్రిస్మస్ కు గుమ్మడికాయ కొట్టేసి, సంక్రాంతికి విడుదల చేస్తామంటూ రిలీజ్ డేట్స్ కూడా చెప్పేశాడు బాలయ్య.
అయితే ఇదంతా సరదాగానే సాగింది. తను చేస్తున్న ఛాట్ షో కోసం సుకుమార్, బన్నీ, రష్మికను ఆహ్వానించాడు బాలకృష్ణ. ఈ సందర్భంగా సుకుమార్ తో సినిమా చేయాలనే కోరికను బయటపెట్టాడు. అటు సుకుమార్ మాత్రం బాలయ్య ఆఫర్ కు ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వలేదు. తప్పకుండా చేద్దాం అనే అర్థం వచ్చేలా తల మాత్రం ఊపాడంతే.